X
తెలుగు » సినిమాలు » ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్

Comedy | Romance | 02 Jun 2017 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ స్టోరీ

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్  సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన పాత మధురం 'లేడీస్ టైలర్' సినిమాకి సీక్వెల్ని రూపొందిస్తున్నారు. ఇందులో సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస, కృష్ణ భగవాన్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం 'లేడీస్‌ టైలర్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజెండరీ డైరెక్టర్‌ వంశీనే, ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహించారు మరియు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు అందించారు.    కథ లేడీస్ టైలర్ సుందరం, సుజాత టీజర్ల కొడుకైన గోపాళం(సుమంత్ అశ్విన్) తండ్రి వృత్తినే కొనసాగిస్తూ చుట్టు పక్కల ఊర్లలో మంచి పనితనం ఉన్న లేడీస్ టైలర్ గా పేరు తెచ్చుకుంటారు. చేసేది టైలరింగే అయినా ఎవరైనా లేడీస్ టైలర్ అంటే అస్సలు నచ్చదు గోపాళానికి. తనను తాను ఫ్యాషన్ డిజైనర్ గా చెప్పుకుంటాడు. వీలైనంత త్వరగా సిటీలో షాపు తెరిచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలనే డ్రీమ్స్ లో ఉంటాడు. ఓ రోజు జ్యోతిష్కుడు ఫ్యాషన్ డిజైనర్ చేతిలో ఉన్న రేఖ చూసి అది మామూలు రేఖ కాదని, మన్మధరేఖ అని..... ఈ రేఖ లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటుందని, ఈ రేఖ ఉన్నవాళ్లు ఎలాంటి అమ్మాయిలనైనా ఇట్టే ప్రేమలో దింపే శక్తి కలిగి ఉంటారని చెబుతాడు. దీంతో ఊర్లో బాగా డబ్బున్న అమ్మాయిలను చూసి వారిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుని..... అలా వచ్చిన డబ్బుతో సిటీలో పెద్ద షాపు పెట్టాలనే ఆలోచనలో ఉంటాడు. ఈ క్రమంలోనే మొదట గేదెల రాణి(మానస), తర్వాత అమ్ములు(మనాలి రాథోడ్), ఆ తర్వాత మహాలక్ష్మి(అనీషా ఆంబ్రోస్) ...... ఇలా ఒకరికంటే ఒకరు బాగా డబ్బున్న అమ్మాయిలను ప్రేమలో దించే ప్రయత్నం చేసి చివరకు తన చావు మీదకు తెచ్చుకుంటాడు. చివరకు గోపాళం పరిస్థితి ఏమైంది? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది తెరపై చూడాల్సిందే. 
Read More

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ కాస్ట్ & క్రూ

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తను తీసే సినిమాల్లో తన మార్కు కనపడేలా కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తుంటాడు వంశీ. ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' విషయంలో కూడా తన మార్కును కొనసాగించాడు. ఈ విషయంలో ఆయన ఏ మాత్రం మారలేదు. ఈ సినిమాకే కాదు... ఆయన గత పది సినిమాలు పరిశీలించినా ఇదే మార్కు కనిపిస్తుంది. లేడీస్ టైలర్లో రాజేంద్రప్రసాద్ రేంజికకాక పోయినా..... ఫ్యాషన్ డిజైనర్ గా సుమంత్ అశ్విన్ ఫర్వాలేదిపించాడు. హీరోయిన్లు అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస పెర్ఫార్మెన్స్ పరంగా యావరేజే అయినా, గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు. కృష్ణ భగవాన్, ఇతర నటీటనలు వారి వారి పాత్రల మేరకు రాణించారు. వంశీ సినిమాలు అంటేనే గోదావరి, కోనసీమ అందాలు చూపించకుండా సినిమా ఉండదు. ‘ఫ్యాషన్ డిజైనర్' సినిమా మొత్తం కూడా కోనసీమ, పాపికొండలు ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. ఇక పాపికొండల అందాలను వంశీ ఈ సినిమాలో చూపించినంత అందంగా మరే సినిమాలోనూ చూపించలేదు. ఇవన్నీ పక్కన పెడితే....సినిమాలో కొన్ని చోట్లు క్రియేటివిటీ విషయంలో వంశీ తనదైన మార్కు చూపించారు. సినిమాపై ఆయనకు ఎంత పాషన్ ఉందో వాటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులోనూ ఆయనలో సినిమా మేకింగులో ఉన్న కసి ఏమాత్రం తగ్గలేదు. ఈ విషయంలో వంశీ సూపర్.....

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+