X
ఫిదా
Romance | 21 Jul 2017 | U |
Telugu

ఫిదా స్టోరీ

ఫిదా సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి, రాజ చెంబొలు, సాయి చంద్, శరణ్య, గీతా భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ కమ్ముల నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కే జె మేయర్ స్వరాలు అందించారు.

కథ

వరుణ్ ( వరుణ్ తేజ్) తన అన్నయ్య (రాజా), తమ్ముడితో కలిసి అమెరికాలో ఉంటారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ ముగ్గురే కలిసి ఉంటాడు. అన్నయ్యకు పెళ్లి జరిగితే ఒంటరిగా బతుకున్న ఆ ముగ్గురు ఓ కుటుంబంగా మారుతుందనే భావిస్తాడు వరుణ్. ఇంటర్నెట్‌లో మ్యారేజ్ వెబ్‌సైట్ చూసి బాన్సువాడలో ఉంటున్న భానుమతి (సాయిపల్లవి) ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. భానుమతి అక్కయ్య (రేణు)తో వరుణ్ అన్నయ్య పెళ్లిచూపులు జరగడం, ఇరువర్గాలకు నచ్చడంతో వారంలోపే పెళ్లి జరుగుతుంది. ఈ వారంలో వరుణ్, భానుమతి చాలా దగ్గరవుతారు. ఇద్దరు ప్రేమించుకొంటారు. కానీ మనసు విప్పి చెప్పుకోలేకపోతారు. ఓ కారణంగా వరుణ్‌ను తప్పుగా భానుమతి అర్థం చేసుకొని అతనిపై ప్రేమను చెరిపేసుకుంటుంది. వరుణ్‌పై కోపం, ద్వేషం పెంచుకొని అతడిని పక్కన పెడుతుంది. వరుణ్‌పై ఉండే ద్వేషంతో ఊర్లో ఉండే ఓ వ్యాపారవేత్త (హర్షవర్థన్ రాణే) తో పెళ్లికి ఒప్పుకుంటుంది భానుమతి. దీంతో భానుమతి ప్రేమలో పీకల్లోతు మునిగిన వరుణ్ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఈ క్రమంలో భానుమతి బాన్సువాడ నుంచి అమెరికా వెళ్తుంది. అక్కడ భాను, వరుణ్ మధ్య లవ్ అండ్ హేట్ సీన్లు బాగానే జరుగుతాయి. ఆ తర్వాత ప్రేమను పక్కన పెట్టి స్నేహితులుగా మారుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు భాను బాన్సువాడకు తిరిగివస్తుంది. కానీ భానుమతిని వదలేక వరుణ్ బాన్సువాడకు వస్తాడు. ఆ తర్వాత వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందా? వరుణ్ ప్రేమను భాను అంగీకరిస్తుందా? హర్షవర్థన్‌తో పెళ్లి ఆగిపోతుందా? పెళ్లైన తర్వాత వరుణ్, భాను అమెరికా వెళ్లకుండా బాన్సువాడలోనే ఎందుకు స్థిరపడుతాడు? భానుపై అంతగా ఫిదా అయ్యే అంశాలు వరుణ్‌కు ఏమి కనపడ్డాయి? ఇలాంటి ప్రశ్నలకు వెండితెర మీద భావోద్వేగ సమాధానాలే ఫిదా చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+