ఫిటింగ్ మాస్టర్ సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం అల్లరి నరేష్, మదాలసా శర్మ, షాయేజి షిండే, సుధ, చంద్రమోహన్, సైరాబాను తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం,నిర్మాత:ఇవివి సత్యనారాయణ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చిన్నా స్వరాలు సమకుర్చారు.
కథ
జిమ్ మాస్టర్ గా పనిచేసే సంపత్(అల్లరి నరేష్)..ప్రేమలంటే అసహ్యం. దాంతో అలాంటిదేమన్నా పొరపాటున కంటబడితే ఎదుటివాళ్ళకి(చూసేవాళ్ళకు) విరక్తి పుట్టేలా క్లాస్ పీకుతూంటాడు. ఇది వింతగా అనిపించిన ఓ డబ్బున్న పనిపాటా లేని అమ్మాయి మేఘన(మదాలస శర్మ) అతన్ని ఎలా గయినా ప్రేమ ముగ్గులోకి దింపుతానని ప్రతిజ్ఞ పూని రంగంలోకి దూకుతుంది. దాంతో ఇలాంటి అవాకాశం కోసం చూస్తున్నట్లు సంపత్ దానికీ బ్రేక్ వేసి ఆ అమ్మాయి ఇంటికెళ్ళి తల్లి తండ్రులను కలిసి మీ అమ్మాయి జాగ్రత్త అని చెప్పేసి..కన్నవాళ్ళ ప్రేమ చాలా గొప్పది అని పనిలో పనిగా క్లాస్ పీకేసి బయిటపడతాడు. ఏమిటీ ఇతగాడికి మెంటలా..వయిస్సులో ఉండి ఇలాంటి విచిత్రమైన కబుర్లు చెబుతున్నాడేంటి అని ఆశ్చర్యపడే లోగా ఒక వ్యక్తిని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చంపేస్తాడు. అలాగే తన ప్రేమ రాయిబారం నడపటానికి మేఘన అన్నని అమెరికానుంచి ఆమె పిలిస్తే అతన్ని చంపేస్తాడు. ఎవరీ సంపత్..ఎందుకిలా చంపుతున్నాడు అన్నాదే మిగతా కథ.