గబ్బర్ సింగ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి మాటలు-మార్పులు-దర్శకత్వం: హరీష్‌శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
చిన్నప్పుడు షోలే సినిమా తెగ చూసి అందులో గబ్బర్ సింగ్ పాత్రను విపరీతంగా ప్రేమించి తన పేరుని గబ్బర్ సింగ్ గా మార్చుకున్న పోలీస్ అధికారి వెంకటరత్నం నాయుడు(పవన్ కళ్యాణ్). చాలా కాలం తర్వాత తన సొంత ఊరు కొండవీడు కి ట్రాన్సఫర్ అయి వస్తాడు. అతనొచ్చే సమయానికి లోకల్ గూండా సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)కి రాజకీయంగ ఎదగటానికి ప్రయత్నాలు చేస్తూంటాడు. అయితే కాస్త తిక్క ఉన్న గబ్బర్ సింగ్ కి అతని విలనీ ఛేష్టలు నచ్చక ఎటాక్ ఇచ్చి అడ్డుపడతాడు. అక్కడ నుంచి వీరిద్దరి మధ్యా టామ్ అండ్ జెర్రీ తరహా గేమ్ స్టార్ట్ అయ్యి అది వార్ గా మారుతుంది. లోకల్‌గా ఎంతో పట్టు ఉన్న విలన్‌కి ఎలా అడ్డుపడి గబ్బర్ సింగ్ ఆ ఊరుని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో అతను ఏమి పోగొట్టుకున్నాడు.. ఏమి సాధించాడు.. భాగ్య లక్ష్మి(శృతి హాసన్)తో అతని ప్రేమ కథ ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.