X
తెలుగు » సినిమాలు » గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

Action | Romance | 11 May 2012 | A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

గబ్బర్ సింగ్ స్టోరీ

గబ్బర్ సింగ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి మాటలు-మార్పులు-దర్శకత్వం: హరీష్‌శంకర్‌ నిర్వహించారు మరియు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ చిన్నప్పుడు షోలే సినిమా తెగ చూసి అందులో గబ్బర్ సింగ్ పాత్రను విపరీతంగా ప్రేమించి తన పేరుని గబ్బర్ సింగ్ గా మార్చుకున్న పోలీస్ అధికారి వెంకటరత్నం నాయుడు(పవన్ కళ్యాణ్). చాలా కాలం తర్వాత తన సొంత ఊరు కొండవీడు కి ట్రాన్సఫర్ అయి వస్తాడు. అతనొచ్చే సమయానికి లోకల్ గూండా సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)కి రాజకీయంగ ఎదగటానికి ప్రయత్నాలు చేస్తూంటాడు. అయితే కాస్త తిక్క ఉన్న గబ్బర్ సింగ్ కి అతని విలనీ ఛేష్టలు నచ్చక ఎటాక్ ఇచ్చి అడ్డుపడతాడు. అక్కడ నుంచి వీరిద్దరి మధ్యా టామ్ అండ్ జెర్రీ తరహా గేమ్ స్టార్ట్ అయ్యి అది వార్ గా మారుతుంది. లోకల్‌గా ఎంతో పట్టు ఉన్న విలన్‌కి ఎలా అడ్డుపడి గబ్బర్ సింగ్ ఆ ఊరుని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో అతను ఏమి పోగొట్టుకున్నాడు.. ఏమి సాధించాడు.. భాగ్య లక్ష్మి(శృతి హాసన్)తో అతని ప్రేమ కథ ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

గబ్బర్ సింగ్ కాస్ట్ & క్రూ

గబ్బర్ సింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హారిస్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత బండ్ల గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గబ్బర్ సింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
"నాకు నేనే పోటీ. నాతో నాకే పోటీ... నాతో ఎవరూ పోటీకి రారు,రాలేరు.."అంటూ పవర్ ఫుల్ పంచ్ డైలాగుతో, ఫ్యాన్స్ కి కిక్కిచ్చే డాన్స్ లతో పవర్ స్టార్ ప్రభంజనంలా దూసుకొచ్చేసాడు. పంజా వంటి పెద్ద ప్లాప్ తర్వాత తన అభిమానులు కూడా నిరాశ చెందారనుకున్నారో ఏమో గానీ.. పూర్తిగా తనదైన శైలిలో ఫైట్స్, స్టైప్స్ తో గబ్బర్ సింగ్ పాత్రను అడ్డం పెట్టుకుని పవన్ చెలరేగిపోయాడు. దబాంగ్ రీమేక్ గా వచ్చినా... చాలా భాగం కథ, కథనం మార్చి.. హరీష్ శంకర్ తన కలం బలం చూపించి మాస్ ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసాడు. సెకండాప్ కొద్దిగా స్లోగా సాగినట్లున్నా ఓవరాల్ గా ఫ్యాన్స్ కి విందు భోజనంలా, సామాన్య ప్రేక్షకులుకు మంచి కిక్కు ఇచ్చే సినిమాగా సినిమాని తీర్చిదిద్ది విజయం సాధించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్, కెవ్వు కేక పాట సినిమాకి యూఎస్‌పిలా నిలుస్తాయి.

గబ్బర్ సింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గబ్బర్ సింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+