X
గౌతమ్ నంద
Romance | 28 Jul 2017 | U/A |
Telugu

గౌతమ్ నంద స్టోరీ

గౌతమ్ నంద సినిమా స్టైలిష్ యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, హాన్సిక, కేథరిన్, నికితన్ ధీర్, ముకేష్ రుషి, తనికెళ్ళ భరణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంపత్ నంది నిర్వహిస్తున్నారు మరియు శ్రీ బాలాజి సినీ మీడియా పతాకంపై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ సమకుర్చుతున్నారు. 

కథ

అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తగా ఫోర్బ్స్ జాబితాలో చేరిన ఘట్టమనేని విష్ణుకుమార్ (సచిన్ ఖేడ్కర్) కుమారుడు ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్). విలాసవంతంగా గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేసే గౌతమ్‌కు ఓ సందర్భంలో ఊహించిన ఓ సంఘటన ఎదురవుతుంది. సొంత గుర్తింపు లేని బతుకు ఎందుకు అని గౌతమ్‌ మనస్తాపానికి గురవుతాడు. తానేందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరకి విలాసవంత జీవితంపై విరక్తి కలిగి చనిపోవాలనుకొంటాడు. ఆ క్రమంలో గౌతమ్‌కు హైదరాబాద్ బోరబండలో నివాసి అయిన నంద (గోపిచంద్) ఓ విచిత్రమైన పరిస్థితిలో తారసపడుతాడు. అచ్చం తనలాగే ఉండే నందను చూసి గౌతమ్ షాక్ అవుతాడు. జీవితంపై విరక్తి చెంది తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని చెబుతాడు. డబ్బు లేక పోవడమే తన ఆత్మహత్యకు కారణమని నంద వివరిస్తాడు. ఎక్కువ సంపద ఉండటమే తనకు ఆత్మహత్యకు కారణమని గౌతమ్ చెబుతాడు. ఇలా ఒకరి జీవితాలను మరొకరు తెలుసుకొన్న గౌతమ్, నంద‌లు ఓ అవగాహనకు వస్తారు. 30 రోజులపాటు ఒకరి జీవితాల్లోకి మరొకరు వెళ్లాలని డిసైడ్ అవుతారు. గౌతమ్ జీవితంలోని విలాసాన్ని నంద, నంద జీవితంలోని కష్ట సుఖాలు గౌతమ్ తెలుసుకొంటారు. ఆ క్రమంలో గౌతమ్‌ను కొందరు చంపడానికి వెంటాడుతుంటారు. గౌతమ్‌ను ఎవరు చంపాలనుకొంటున్నారు? గౌతమ్ ప్లేస్‌లోకి వెళ్లిన నంద పరిస్థితి ఏమిటి? నంద జీవితంలోకి వెళ్లిన గౌతమ్ ఎలాంటి ప్రేమానురాగాలను పొందాడు. చివరికి గౌతమ్ గౌతమ్‌నందగా ఎందుకు మారాడానే ప్రశ్నలకు సమాధానమే గౌతమ్ నంద చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+