గుర్తుందా శీతాకాలం (2022)(U/A)
Release date
09 Dec 2022
genre
గుర్తుందా శీతాకాలం స్టోరి
గుర్తుందా శీతాకాలం సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, తమన్నా భాటియా, మేఘ ఆకాష్ తదితరులు నటించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన రవి సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు కాలభైరవ స్వరాలు అందించారు.
కథ
మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యదేవ్ (సత్యదేవ్) అమ్మాయి ప్రేమను పొందాలని కోరికతో ఉంటాడు. కాలేజీలో సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అమృత (కావ్యశెట్టి)తో ప్రేమలో పడుతాడు. అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సమయంలో అమృత బ్రేకప్ చెప్పడంతో సత్యదేవ్ షాక్‌లో ఉండిపోతాడు. విషాదకరంగా ఉన్న సమయంలో సత్యదేవ్ జీవితంలోకి నిధి (తమన్నా భాటియా) ప్రవేశిస్తుంది. ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన అమ్మత ఎందుకు సత్యదేవ్‌కు బ్రేకప్ చెప్పింది? అమృతతో బ్రేకప్ తర్వాత సత్యదేవ్ పరిస్థితి ఏమిటి? మిడిల్ క్లాస్ కుర్రాడు సత్యదేవ్ మ్యారేజ్ ప్రపోజల్‌ను తన కంటే అందగత్తె నిధి అంగీకరించింది? అసలు నిధి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? నిధికి అబార్షన్ ఎందుకు జరిగింది? సత్యదేవ్ జీవితంలోకి నిధి వచ్చిన తర్వాత ఏం జరిగింది? సత్యదేవ్ జర్నీలో దివ్య పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. అసలు దివ్యతో సత్యదేవ్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే గుర్తుందా శీతాకాలం సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie గుర్తుందా శీతాకాలం with us? Please send it to us ([email protected]).