హ్యాపీ హ్యాపీగా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ సందేశ్, వేగ, శరణ్యా మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, రంజిత, అలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రియా శరణ్ నిర్వహించారు మరియు నిర్మాత దుర్గా ప్రసాద్ వడ్లమూడి నిర్మించారు. ఈ చిత్రానికి సంగితదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
సంతోష్(వరుణ్ సందేశ్) అన్ని తెలుగు సినిమాల్లో లాగ ఓ అనాధ. నలుగురు స్నేహితులతో కలిసి కార్టూన్ గైస్ పేరుతో ఓ గిప్ట్ కార్నర్ తరహా వెరైటీ బిజెనెస్ చేస్తూంటాడు. తమకు కావాల్సిన వారుకి గిప్ట్ ఇవ్వాల్సి వస్తే సంతోష్ కి షాప్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ పని పూర్తి చేస్తూంటారు. మరో ప్రక్క ఉంటే సంతోష్ తన ఖాళీ టైమ్ లో ఎవరన్నా అమ్మాయి పడకపోతారా అన్నట్లు లవ్ లెటర్స్ పట్టుకు తిరుగుతూంటాడు. ఈ క్రమంలో అతనికి పూజ(వేగ) పరిచయమవుతుంది. వెంటనే ప్రేమలో పడిన అతను ప్రపోజ్ చేద్దామనుకునేసరికి..ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే ఆమెకి లవ్ అంటే సదాభిప్రాయం లేదని. దాంతో స్టైయిట్ గా ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా...తను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని అబద్దమాడతాడు. ఎవరా చూపెట్టమని పూజ పట్టుబడితే...సంతోష్ అప్పటికప్పుడు తన కళ్ళకు కనపడిన అమ్మాయి ప్రియ(శరణ్యా మోహన్) ని చూపెడతాడు. అది నిజమే అనుకుని నమ్మిన పూజ వీరిద్దరనీ కలపాలని ప్లాన్ చేస్తుంది. ఈలోగా మరో ట్విస్ట్...ప్రియ మరెవరో కాదు...ఆ ఊళ్ళో ఉన్న పెద్ద డాన్ సూరి చెల్లెలు. అతనితి తన చెల్లి వంక ఎవరు చూసినా నచ్చదు..కాలో..చెయ్యో తీసేస్తాడు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇరుక్కున్న సంతోష్ ఏం చేసాడు అన్నది మిగతా కథ.