X
Home టాప్ లిస్టింగ్

2023 అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు టాప్ 5

Author Administrator | Published: Thursday, May 25, 2023, 04:51 PM [IST]

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం రావడం అంటే అదృష్టమే. ఎందుకంటే గౌరవ మర్యాదలతో పాటు ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ ఉంటుంది. అంతేకాకుండా కొద్ది కాలంలోనే స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావాలంటే యువతులకు అందం, అభినయంతో పాటు నటన టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే వారు అనుకున్న రేంజ్ లో పారితోషికం తీసుకుంటారు. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గ‌ర కూడా ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. అస‌లు తెలుగులో ఎవ‌రెవ‌రు ఎంత పారితోషికం అందుకుంటున్నారో వాళ్లలో టాప్ 5 ఎవరో చూద్దాం. Note: మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం తెలియజేస్తున్నాం.


cover image
పూజా హెగ్డే
1

ప్రస్తుతం తెలుగులో ఉన్న అతికొద్ది మంది టాప్ హీరోయిన్‌లలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. అంతేకాకుండా పాన్ఇండియా స్థాయి చిత్రాలకు కూడా ఈ అమ్మడుకు బాగా కలిసొచ్చాయి.  ప్రస్తుతం  పూజా హెగ్డే ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

రష్మిక మందన్న
2

ఇప్పుడు ఎక్కడ చూసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరే వినిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ దూసుకుపోతోంది రష్మిక. టాలీవుడ్ లో ఛలో సినిమాతో పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ రాణించింది. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ను బట్టి 6 కోట్లకు పైనే డిమాండ్ చేస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

సమంత రుతు ప్రభు
3

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒక్కరు  సమంత.. ఓవైపు తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లో కూడా నటించూ బిజీగా ఉంది. పుష్పలో చేసిన ఐటం సాంగ్‌తో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం సామ్‌ సైన్‌ చేయబోయే సినిమాలకు దాదాపు రూ. 6-8కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం.

 

అనుష్క శెట్టి
4

సూపర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తరువా సూపర్బ్ హీరోయిన్ అనిపించుకుంది. బాలీవుడ్ సినిమాలో నటించిన అనుష్క ఆ తరువాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ నటిస్తున్న అనుష్క రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటుందట. ఈ భామ 6నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటుందట.

శ్రీ లీల
5

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె సినిమా లు చేస్తోంది.హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క డిమాండ్ ఏ రేంజ్ లో ఉంది. ప్రతుతం టాప్ హీరోలందిరి తోనూ వరుస పెట్టి మూవీస్ చేస్తోంది.  ఇంతటి డిమాండ్ ఉన్న శ్రీలీల పారితోషికం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4-5 కోట్లు  రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+