హరే రామ్ సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణరామ్, ప్రియమణి, సింధుతులాని, కోట, రఘుబాబు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, అపూర్వ, వైజాగ్ ప్రసాద్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్ష వర్దన్ నిర్వహించారు మరియు నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
నిజానికి ఇలాంటి కథలు మనకు కొత్తేం కాదు.మొన్న మొన్న వచ్చిన 'మన్మధ' నుండి నిన్నటి 'హలో ప్రేమిస్తారా' దాకా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాన్సెప్ట్ కాస్త డిఫెరెంటు. ఈ రివేంజ్ డ్రామా కథలో హరికృష్ణ, రామ్ (కళ్యాణ్ రామ్) కవలలు. అయితే రామ్ పుట్టినప్పుడు వచ్చిన కొన్ని లోపాలతో మానసికంగా ఎదగడు. అలాగే ఎవరయినా అతని కన్నా ఎక్కువ తెలివైన వాళ్ళుంటే తట్టుకోలేరు. ఆ క్రమంలో అతను తన అన్ననే చంపటానికి పూనుకుంటాడు. అప్పుడతని తల్లి రామ్ ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. కాలక్రమంలో హరి పోలీస్ అధికారిగా ఎదుగి, క్రిమినల్ గా ఎదిగిన రామ్ నే పట్టుకోవాల్సిన స్దితి వస్తుంది. అప్పుడేం జర్గింది. సిటీలో ఉన్న హెల్త్ మాఫియా (కోట) కీ ఈ కథకీ సంభంధం యేమిటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.