twitter

    హలో గురు ప్రేమ కోసమే స్టోరి

    హలో గురు ప్రేమ కోసమే సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, సితార, ఆటో రామ్ ప్రసాద్, జయప్రకాష్ వి, సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రినాథరావు నక్కిన వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. 

    కథ

    కాకినాడకు చెందిన సంజు(రామ్) జెన్యూన్‌గా ప్రేమించుకునే వారి కోసం ఏదైనా చేసే కుర్రాడు. ఫ్రెండ్ చెల్లిని ఏడిపిస్తున్నారని తెలిసి బ్యాచ్‌తో కొట్టడానికి వెళ్లి వారు ప్రేమించుకుంటున్నారని తెలిసి పెళ్లి చేస్తాడు. దీని వల్ల ఫ్రెండ్ దూరం అవుతాడని తెలిసినా.... ఫ్రెండ్స్ విడిపోతే ఎప్పటికైనా మళ్లీ కలవొచ్చు, నిజమైన ప్రేమికులు విడిపోతే జీవితంలో కలవలేరు అని వాదించే రకం. అమ్మానాన్న సంతోషం కోసం హైదరాబాద్ వెళ్లి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయినైన సంజు ప్రేమలో పడ్డ తర్వాత ఏం జరిగిందో చెప్పే కథ ‘హలో గురు ప్రేమ కోసమే'

    తన ఫ్రెండ్ ఇంట్లోనే ఉండాలని అమ్మ కోరిక మేరకు సంజు.... విశ్వనాథం (ప్రకాష్ రాజ్) ఇంట్లో దిగుతాడు. విశ్వానాథంకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. కానీ వాళ్ల ఇంటికి రాకముందే ట్రైన్లో కలిసిన విశ్వానాథం కూతురు అనుపమను చూసి ఇంప్రెస్ అయిన సంజు.... ఈ విషయం అనుపమకు కానీ, విశ్వనాథంకు కానీ చెప్పేలోపే ఆమెకు వేరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఒక ఫ్రెండుగా తన మనసులో అనుపమ ఉన్న విషయాన్ని విశ్వనాథంకు చెబుతాడు.. ఆ అమ్మాయి తన కూతురు అని తెలియక ముందు నీ ప్రేమకు హెల్ప్ చేస్తానని ఒక ఫ్రెండుగా చెప్పిన విశ్వనాథం, ఆ అమ్మాయి తన కూతురే అని తెలిసిన తర్వాత తండ్రిగా ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటనేది మిగతా కథ.

    **Note:Hey! Would you like to share the story of the movie హలో గురు ప్రేమ కోసమే with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X