X
తెలుగు » సినిమాలు » హలో గురు ప్రేమ కోసమే
హలో గురు ప్రేమ కోసమే

హలో గురు ప్రేమ కోసమే

Action | 18 Oct 2018 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

హలో గురు ప్రేమ కోసమే స్టోరీ

హలో గురు ప్రేమ కోసమే సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, సితార, ఆటో రామ్ ప్రసాద్, జయప్రకాష్ వి, సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రినాథరావు నక్కిన వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.  కథ కాకినాడకు చెందిన సంజు(రామ్) జెన్యూన్‌గా ప్రేమించుకునే వారి కోసం ఏదైనా చేసే కుర్రాడు. ఫ్రెండ్ చెల్లిని ఏడిపిస్తున్నారని తెలిసి బ్యాచ్‌తో కొట్టడానికి వెళ్లి వారు ప్రేమించుకుంటున్నారని తెలిసి పెళ్లి చేస్తాడు. దీని వల్ల ఫ్రెండ్ దూరం అవుతాడని తెలిసినా.... ఫ్రెండ్స్ విడిపోతే ఎప్పటికైనా మళ్లీ కలవొచ్చు, నిజమైన ప్రేమికులు విడిపోతే జీవితంలో కలవలేరు అని వాదించే రకం. అమ్మానాన్న సంతోషం కోసం హైదరాబాద్ వెళ్లి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయినైన సంజు ప్రేమలో పడ్డ తర్వాత ఏం జరిగిందో చెప్పే కథ ‘హలో గురు ప్రేమ కోసమే' తన ఫ్రెండ్ ఇంట్లోనే ఉండాలని అమ్మ కోరిక మేరకు సంజు.... విశ్వనాథం (ప్రకాష్ రాజ్) ఇంట్లో దిగుతాడు. విశ్వానాథంకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. కానీ వాళ్ల ఇంటికి రాకముందే ట్రైన్లో కలిసిన విశ్వానాథం కూతురు అనుపమను చూసి ఇంప్రెస్ అయిన సంజు.... ఈ విషయం అనుపమకు కానీ, విశ్వనాథంకు కానీ చెప్పేలోపే ఆమెకు వేరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఒక ఫ్రెండుగా తన మనసులో అనుపమ ఉన్న విషయాన్ని విశ్వనాథంకు చెబుతాడు.. ఆ అమ్మాయి తన కూతురు అని తెలియక ముందు నీ ప్రేమకు హెల్ప్ చేస్తానని ఒక ఫ్రెండుగా చెప్పిన విశ్వనాథం, ఆ అమ్మాయి తన కూతురే అని తెలిసిన తర్వాత తండ్రిగా ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటనేది మిగతా కథ.
Read More

హలో గురు ప్రేమ కోసమే కాస్ట్ & క్రూ

హలో గురు ప్రేమ కోసమే సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రినాథరావు నక్కిన
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హలో గురు ప్రేమ కోసమే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమా కథలో కొత్తదనం మిస్సవ్వడం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. స్క్రీన్లే కూడా ఆసక్తికరంగా లేదు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెండాఫ్ వేగం చాలా తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. కూతురు విషయంలో ప్రకాష్ రాజ్ మీద వచ్చే సీన్లలో కానీ, తను ప్రేమిస్తున్న అమ్మాయి విషయంలో రామ్ మీద వచ్చే సీన్లలో కానీ ఎక్కడా ఎమోషనల్ డెప్త్ కనిపించదు. ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేయడంతో దర్శకుడు విఫలం అయ్యాడు. ఇక్కడ అప్రస్తుతం అయినా...దర్శకుడు త్రినాథరావు గత చిత్రం ‘నేను లోకల్' సినిమా విజయానికి కారణం కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం, సీన్లలో ఆ ఎమోషనల్ డెప్త్ ఉండటమే. ‘హలో గురు ప్రేమ కోసమే'లో క్లైమాక్స్ సైతం పరమ సాధారణంగా ఉంది. ప్రేమకథల్లో కొత్తదనం కంటే ఎమోషనల్ సీన్లు సినిమాను ఓ రేంజికి తీసుకెళతాయి. ఈ చిత్రంలో అది మిస్సయిందని చెప్పక తప్పదు.

హలో గురు ప్రేమ కోసమే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

హలో గురు ప్రేమ కోసమే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+