హలో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని, కల్యాని ప్రియదర్శన్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, అజై, మైఖేల్ గాంధీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ కుమార్ వహించారు మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.
కథ
శ్రీను ఓ వీధి బాలుడు. సంపన్న కుటుంబానికి చెందిన జున్ను (కల్యాణి ప్రియదర్శన్)కు చిన్నతనంలోనే శ్రీనుతో పరిచయం ఏర్పడుతుంది. శ్రీనుతో పరిచయం ఇష్టంగా మారుతుంది. కానీ ఓ కారణంగా వాళ్లిద్దరూ విడిపోతారు. అయితే విడిపోయే ముందు శ్రీనుకు ఓ ఫోన్ నంబర్ ఇస్తుంది. కానీ శ్రీను ఆమెకు ఫోన్ చేయలేకపోతాడు. జున్ను ప్రియగా, శ్రీను అవినాష్‌గా మారిపోతారు. అలా వారి మధ్య ఎడబాటు సుమారు 15 ఏళ్లుగా ఉంటుంది. ప్రతీక్షణం ఇద్దరు ఒకరి గురించి ఒకరు తలచుకొంటారు. అయితే ఫోన్ నంబర్ ఉన్నా శ్రీను ఎందుకు కలుసుకోలేకపోయాడు? శ్రీను అవినాష్‌గా ఎందుకు మారిపోయాడు. సరోజిని (రమ్యకృష్ణ), ప్రకాశ్ (జగపతిబాబు)కు శ్రీనుకు సంబంధం ఏమిటి? జున్నుగా మారిన ప్రియా శ్రీనును ఎలా కలుసుకొన్నారు? అలా కలుసుకోవాడానికి వారు ఎన్ని కష్టాలు పడ్డారు అనే ప్రశ్నలకు సమాధానమే హలో చిత్ర కథ.