X
హైపర్
Action | Romance | 30 Sep 2016 | U/A | 143 Mins
Telugu

హైపర్ స్టోరీ

హైపర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, రాశి ఖన్నా, సత్యరాజ్, నరేష్, రావు రమేష్, మురలీ శర్మ, పోసాని కృష్ణామురళి, ప్రభాస్ శ్రీను, హేమ, తులసి, ప్రియ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నరు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జిబ్రాన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

సూర్య (రామ్) నిజాయతీ గల ఓ గవర్నమెంట్ ఉద్యోగి నారాయణమూర్తి (సత్యరాజ్‌). సూర్య హైపర్ కదా అందుకే...తండ్రి అంటే సూర్యకి విపరీతమైన ప్రేమ. ఆయనకోసం చావటానికైనా , చంపటానికైనా సిద్దం అన్నట్లు బిహేవ్ చేస్తూంటాడు. ఓ రోజు రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న నారాయణమూర్తి దగ్గరకు ఓ ఫైల్ వస్తుంది. ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సంతకం చేయమని మంత్రి రాజప్ప (రావు రమేష్‌) నారాయణమూర్తి దగ్గరికి ఫైల్‌ పంపుతాడు. అయితే రూల్స్ కు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారని.. సంతకం పెట్టనని నారాయణమూర్తి ఆ ఫైల్‌ని తిరస్కరిస్తాడు. మరి విలన్ లక్షణాలు ఉన్న ఆ మినిస్టర్ ఊరుకుంటాడా... బెదిరించటం మొదలెట్టి నారాయణమూర్తిని ఇబ్బందుల్లో పడేయటానికి సిద్దపడతాడు. పిచ్చి ప్రేమతో ఉండే కొడుకు సూర్య కు తన తండ్రిని ఫలానా మినిస్టర్ టార్గెట్ చేసారని తెలుస్తోంది. అంతే వెళ్లి మినిస్టర్ తో పెట్టుకుంటాడు..అతన్ని తన తండ్రి రిటైర్మెంట్ రోజే పదవీ విరమణ చేయిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. హీరో కాబట్టి ఖచ్చితంగా ఛాలెంజ్ గెలుస్తాడు. అయితే మిడిల్ క్లాస్ హీరో, మినిస్టర్ స్ధాయి వ్యక్తిని ఎలా రోడ్డుమీద పడేసాడన్నదే మిగతా కథ. ఈ మధ్యలో సూర్య తో ప్రేమలో పడ్డ భానుమతి (రాశిఖన్నా) కథేమిటి అన్నది కూడా పారలల్ గా నడుస్తూంటుంది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+