ఇది నా లవ్‌స్టోరి సినిమా కన్నడంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని "ఇది నా లవ్‌స్టోరి" అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు...తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో పలు మార్పులు చేసి రోమాంటిక్ కామిడి ఎంటర్టైనర్ రూపోందిస్తున్నారు. ఇందులో నటిస్తున్నవారు తరుణ్, ఓవియ హెలెన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ గోపి వహిస్తుంచారు మరియు నిర్మాత ఎస్ వి ప్రకాష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీనాథ్ విజయ్ స్వరాలు అందించారు.
కథ
అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. తన చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపే విషయంపై మాట్లాడానికి తన కాబోయే బావ చెల్లెలు శృతితో మాట్లాడానికి ఓ గ్రామానికి అభిరామ్ వెళ్తాడు. కానీ శృతికి బదులు అభినయ (ఒవియా హెలెన్)ను కలుసుకొంటాడు. తొలి చూపులోనే అభినయతో ప్రేమలో పడుతాడు. కొద్ది సమయంలోనే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. తమ జీవితంలో జరిగిన ప్రేమ వైఫల్యాల (బ్రేకప్) గురించి అభిరామ్, అభినయ ఒకరికొకరు చెప్పుకొంటారు. అలా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. అంతా సవ్యంగా జరుగుతుందనుకొంటుండగానే అభినయ ఫిర్యాదు చేయడంతో అభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ క్రమంలో అభినయ గురించి ఓ భయంకరమైన విషయం తెలుస్తుంది?. అభినయ గురించి తెలిసిన భయంకర వాస్తవం ఏమిటి? అభిరామ్‌పై అభినయ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభినయ ప్రేమను ఏ విధంగా అభిరామ్ పొందుతాడు. అభినయని పెళ్లి చేసుకోవడానికి అభిరామ్ ఏలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఇది నా లవ్‌స్టోరి సినిమా.