జబర్‌దస్త్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్థ్ నారాయన్, సమంత, నిత్యమీనన్, శ్రీహరి, సునిల్, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత బేల్లంకోండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చారు.
కథ
కథ చూస్తే... పెట్టిన ప్రతీ బిజినెస్ ఫెయిల్యూర్ అవుతూ, అందుకోసం..అందిన చోట్లల్లా అప్పులు చేస్తూ జీవితం గడిపే కుర్రాడు బైర్రాజు (సిద్ధార్థ్). మరో ప్రక్క శ్రియ (సమంత) వెడ్డింగ్ ప్లానర్ గా పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎదగాలనుకునే యువతి. పెళ్లి కూడా వద్దనుకుని ఆ బిజినెస్ కోసం తపనతో తిరుగుతున్న ఆమెకు అనుకోని పరిస్దితుల్లో బైర్రాజు తగులుతాడు. ఇద్దరూ కలిసి...వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ విస్తరించే క్రమంలో ఆమె బైర్రాజుతో ప్రేమలో పడుతుంది. కానీ బైర్రాజుకు ఆమె పై ఏ ఫీలింగ్స్ ఉండవు. ఈ లోగా ఓ గొడవ జరిగి ఇద్దరూ విడిపోతారు. బైర్రాజు వేరేగా స్వంతంగా వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ పెట్టుకుంటాడు. విడిపోయిన వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు...ఈ కథలో నిత్యా మీనన్ పాత్ర ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.