X
తెలుగు » సినిమాలు » జబర్‌దస్త్
జబర్‌దస్త్

జబర్‌దస్త్

Comedy | Romance | 22 Feb 2013 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జబర్‌దస్త్ స్టోరీ

జబర్‌దస్త్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్థ్ నారాయన్, సమంత, నిత్యమీనన్ , శ్రీహరి, సునిల్, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత బేల్లంకోండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చారు. కథ కథ చూస్తే... పెట్టిన ప్రతీ బిజినెస్ ఫెయిల్యూర్ అవుతూ, అందుకోసం..అందిన చోట్లల్లా అప్పులు చేస్తూ జీవితం గడిపే కుర్రాడు బైర్రాజు (సిద్ధార్థ్‌). మరో ప్రక్క శ్రియ (సమంత) వెడ్డింగ్ ప్లానర్ గా పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎదగాలనుకునే యువతి. పెళ్లి కూడా వద్దనుకుని ఆ బిజినెస్ కోసం తపనతో తిరుగుతున్న ఆమెకు అనుకోని పరిస్దితుల్లో బైర్రాజు తగులుతాడు. ఇద్దరూ కలిసి...వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ విస్తరించే క్రమంలో ఆమె బైర్రాజుతో ప్రేమలో పడుతుంది. కానీ బైర్రాజుకు ఆమె పై ఏ ఫీలింగ్స్ ఉండవు. ఈ లోగా ఓ గొడవ జరిగి ఇద్దరూ విడిపోతారు. బైర్రాజు వేరేగా స్వంతంగా వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ పెట్టుకుంటాడు. విడిపోయిన వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు...ఈ కథలో నిత్యా మీనన్ పాత్ర ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

జబర్‌దస్త్ కాస్ట్ & క్రూ

జబర్‌దస్త్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం నందిని రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జబర్‌దస్త్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'అలా మొదలైంది' చిత్రంతో పరిచయమైన దర్శకురాలు నందినీరెడ్డి కొత్త చిత్రం అంటే సమ్ థింగ్ స్పెషాలిటీ ఉంటుందని, మరోసారి ఓ కొత్త రొమాంటిక్ కామెడీని తెరపై ఆవిష్కరిస్తుందని అందరూ ఆశించారు. దానికి తోడు సమంత,సిద్దార్ద జోడి కూడా 'జబర్‌దస్త్' పై అంచనాలు పెంచాయి. అయితే హిందీలో వచ్చిన 'బ్యాండ్ బాజా బారాత్ ' కి ఫ్రీమేక్ కావటం, అదీ చీప్ కామెడీతో నవ్వించే ప్రయత్నం సినిమాలో చాలా చోట్ల జరగటం పూర్తిగా నిరాశపరిచింది. ముఖ్యంగా రొమాంటిక్ కామెడీల్లో ఉండాల్సిన బీట్స్ మిస్సై,సినిమాలో సెకండాఫ్ ని ..ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తరహాలో లాగిన ఫీలింగ్ వచ్చింది. హిందీలో ఎమోషనల్ గా ఉన్న కథని ఫార్సికల్ కామెడీగా మార్చేసారు. క్లైమాక్స్ ని నీరసంగా,ప్రెడిక్టబుల్ గా, సినిమాటెక్ సెంటిమెంట్ తో ముంచేసారు.

జబర్‌దస్త్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జబర్‌దస్త్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+