జఫ్పా సినిమా కామిడి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘు బాబు, అలీ, ఫిష్ వెంకట్, శ్రావణ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెన్నెల కిశోర్ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత అనూఫ్ రుబెన్స్ అందించారు.
కథ
సాఫ్ట్ వేర్ ఎంప్లాయి... జాస్మిన్ పాల్గున ఉరఫ్ జఫ్పా (బ్రహ్మానందం) ఓ మర్డర్ కేసులో జైలుకి వెళ్తాడు. అక్కడ నుంచి బయిటపడదామని వేసిన ఓ దిక్కుమాలిన ప్లాన్ తో... ఓ శవపేటిక లో ఇరుక్కుపోయి.. పాతి పెట్టబడతాడు. ఆ శవపేటికలో కేవలం ఓ సెల్ ఫోన్ మాత్రమే ఉంటుంది. దాని సాయింతో అక్కడ నుంచి అతను ఎలా బయిటపడ్డాడు అనేది మిగతా కథ.