సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అన్ని రకాల పాత్రలు పోషించే సత్తా ఉండాలి. దానికి అదృష్టం తోడు కావాలి. ముఖ్యంగా హీరోగా రాణించాలంటే మామూలు విషయం కాదు. సినిమాలో హీరోగా ఎంపిక కావాలన్నా.. ప్రేక్షకులను మెప్పించాలన్నా ఎంతో కష్టపడాలి. ఇండస్ట్రీలోకి ఏదో విధంగా వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే హీరో వేషాల కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. వారిలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా స్థిరపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అనంతరం విలన్‌గా అలరించి.. హీరో అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోలుగా ఎదిగిన టాప్5 స్టార్ల గురించి