జగమేమాయ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి, బబ్లూ పృథ్వీరాజ్, రాకింగ్ రాకేష్ తదితరులు నటించారు. ఈసినిమాకి దర్శకత్వం సునీల్ పుప్పాల నిర్వహించారు మరియు నిర్మాత ఉదయ్ కోలా, శేకర్ అన్నే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అజయ్ అరసాడ స్వరాలు సమకుర్చారు.
కథ
ఆనంద్ (తేజ మైనంపూడి) బెజవాడలో పనేం చేయకుండా ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటాడు. కానీ ఆ బెట్టింగ్ లో లక్షలు పోగోట్టుకుంటాడు. అప్పు ఇచ్చిన వాళ్లు ఆనంద్ పై ఒత్తిడి తీసుకొస్తారు. దీంతో ప్రేమికులు, అఫైర్స్ పెట్టుకున్నవాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాందిస్తాడు. అప్పుల వాళ్ల నుంచి పూర్తిగా తప్పించుకునేందుకు హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతాడు. అక్కడ ఎవరైనా డబ్బు ఉన్న అమ్మాయిని లైన్ లో పెట్టాలని ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలోనే డిప్రెషన్ క్లాస్ లకు అటెండ్ అవుతాడు. అక్కడ చిత్ర (ధన్య బాలకృష్ణ) పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనాథ అయిన ధన్య బాలకృష్ణ డిప్రెషన్ క్లాస్ కి ఎందుకు వస్తోంది? ఆమె భర్త అజయ్ (చైతన్య రావు)కు ఏమైంది? మరి తను అనుకున్నట్లు ఆనంద్ డబ్బు సంపాదించాడా? ఎవరు ఎవరినీ మోసం చేశారు? వంటి ఆసక్తికర అంశాల సమ్మేళనమే 'జగమే మాయ'.