X
Home టాప్ లిస్టింగ్

ప్ర‌భాస్ గ‌త 5 చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివ‌రాలు..!

Author Administrator | Published: Thursday, June 15, 2023, 06:52 AM [IST]

రామాయ‌ణం ఆధారంగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. జూన్ 16న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం అద్భుత‌మైన ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగింది. అయితే ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ గ‌త చివ‌రి ఐదు చిత్రాలు ఏ మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్‌ల‌ను పూర్తి చేసుకున్నాయ‌నే వివ‌రాల్లోకి వెళితే..


cover image
బాహుబలి

ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబోలో ఛ‌త్ర‌ప‌తి త‌ర్వాత వ‌చ్చిన సినిమా బాహుబ‌లి ది బిగినింగ్ అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. భారీ కోట‌లు, యుద్ధాలు... ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేశాయి. ఈ సినిమాకు రూ.600 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అయితే ఈ సినిమాకు జ‌రిగిన థియేట్రిక‌ల్ బిజినెస్ రూ.118 కోట్లు. ఈ సినిమా కూడా అంద‌రికీ మంచి లాభాల‌ను తెచ్చి పెట్టింది.

బాహుబలి ది కంక్లూజన్‌

ప్ర‌భాస్‌, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి 2 ది కంక్లూజ‌న్ మూవీ.. బాహుబ‌లి ది బిగినింగ్‌కు కొన‌సాగింపు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా ఏకంగా రూ.1700 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. పాన్ ఇండియా మూవీ ఇండ‌స్ట్రీలోనే ఇదొక రికార్డ్ అయితే ఈ సినిమాకు జ‌రిగిన థియేట్రిక‌ల్ బిజినెస్ రూ.352 కోట్లు మాత్ర‌మే. నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కి ఈ చిత్రం అద్భుత‌మైన లాభాల‌ను తెచ్చి పెట్టింది. 

 

సాహో

బాహుబ‌లి 2తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీగా సాహో చిత్రం రిలీజైంది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేశారు. మాస్ యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం రూ.270 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్‌ను జ‌రుపుకుంది. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం హిందీలో వంద కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించ‌టం విశేషం. 

రాధే శ్యామ్

ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ నిర్మించిన చిత్రం రాధేశ్యామ్‌. ఓ ప‌ర్టికుల‌ర్ పీరియ‌డ్‌లో యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌తో న‌డిచే ఈసినిమాలో ప్ర‌భాస్ ఓ ఆస్ట్రాల‌జ‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. పూజా హెగ్డే హీరోయిన్‌. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా రూ.202.80 కోట్ల మేర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్‌ను జ‌రుపుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. 

ఆదిపురుష్

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో టి సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏకంగా ఈ సినిమా కోసం రూ.500 కోట్ల బ‌డ్జెట్‌ను వెచ్చించారు. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు భారీగానే అమ్ముడ‌య్యాయి. థియేట్రిక‌ల్ హ‌క్కుల విష‌యానికి వ‌స్తే రూ.240 కోట్ల మేర‌కు నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇది నిజంగానే పెద్ద మొత్తం మ‌రీ చిత్రం ఏ మేర‌కు క‌లెక్ట్ చేస్తుందో చూడాలి. ఇందులో శ్రీరాముడుగా ప్ర‌భాస్‌.. జాన‌కీ దేవిగా కృతి స‌న‌న్ న‌టించింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+