జిల్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంత్, రాశీ ఖన్నా , చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధ క్రిష్ణ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి క్రిష్ణరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గిబ్రాన్ స్వరాలు సమకుర్చారు.
కథ
జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఆ డాన్ దగ్గర నుంచి డబ్బు కొట్టేసిన రంగనాధ్ (బ్రహ్మాజి) ని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ చివరి క్షణాల్లో రంగనాథ్ .. జై కు ఆ డబ్బు వివరాలు చెప్పాడని సందేహంతో. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. దాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.