జులాయి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు ఎస్ రాధా కృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన నేటి తరం కుర్రాడు..అయితే కష్టపడకుండా ఓవర్ నైట్ లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అది అతని తండ్రి నారాయణ మూర్తి(తణికెళ్ల)కి నచ్చదు. ఓ రోజు తండ్రితో ఎప్పటిలాగే తగువు పడి పదివేలు పట్టుకెళ్లి ఐదు లక్షలుతో తిరిగివస్తానని క్రికెట్ బెట్టింగ్ కి వెళతాడు. అక్కడ నుంచి అతని లైఫ్ అనుకోని మలుపు తిరిగుతుంది. బిట్టు(సోనూ సూద్)అనే ఓ తెలివైన దొంగ తన గ్యాంగ్ తో చేసిన 1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్ గా మారి.. క్రిమినల్స్ కి మోస్ట్ వాంటెడ్ గా మారతాడు. అక్కడ నుంచి పోలీసులు, క్రిమినల్స్ అతని జీవితం అయిపోతుంది. ఈ క్రమంలో అతనికో అమ్మాయి మధు(ఇలియానా) పరిచయం అవుతుంది. క్రిమినల్స్ నుంచి తప్పించుకుంటూ ఆమె ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ.