X
జులాయి

జులాయి

Action | Romance | 09 Aug 2012 | U/A |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

జులాయి స్టోరీ

జులాయి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు ఎస్ రాధా కృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన నేటి తరం కుర్రాడు..అయితే కష్టపడకుండా ఓవర్ నైట్ లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అది అతని తండ్రి నారాయణ మూర్తి(తణికెళ్ల)కి నచ్చదు. ఓ రోజు తండ్రితో ఎప్పటిలాగే తగువు పడి పదివేలు పట్టుకెళ్లి ఐదు లక్షలుతో తిరిగివస్తానని క్రికెట్ బెట్టింగ్ కి వెళతాడు. అక్కడ నుంచి అతని లైఫ్ అనుకోని మలుపు తిరిగుతుంది. బిట్టు(సోనూ సూద్)అనే ఓ తెలివైన దొంగ తన గ్యాంగ్ తో చేసిన 1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్ గా మారి.. క్రిమినల్స్ కి మోస్ట్ వాంటెడ్ గా మారతాడు. అక్కడ నుంచి పోలీసులు, క్రిమినల్స్ అతని జీవితం అయిపోతుంది. ఈ క్రమంలో అతనికో అమ్మాయి మధు(ఇలియానా) పరిచయం అవుతుంది. క్రిమినల్స్ నుంచి తప్పించుకుంటూ ఆమె ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ.
Read More

జులాయి కాస్ట్ & క్రూ

జులాయి సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత డి వి వి దానయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జులాయి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇక అల్లు అర్జున్ నుంచి ప్రేక్షకులు ఆశించే హీరోయిజం స్టైలిష్ టేకింగ్ హడావిడిలో కనపడకుండా పోయింది. రాజేంద్రప్రసాద్ విషయానికి వస్తే ఆయనకు, అల్లు అర్జున్ కి వచ్చే ట్రాక్ తమిళ వెట్టై ని గుర్తు చేసినా బాగానే పేలింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్ గా హైలెట్ అయ్యే బ్రహ్మానందం.. చిల్లర దొంగతనాలు కామెడీ పెద్దగా నవ్వులు పూయించలేకపోయింది. ఎమ్.ఎస్ నారాయణ, హేమ ఎప్పటిలాగే తమ పరిధిలో చేసుకుపోయారు. తణికెళ్ల భరిణి ఏ సినిమాలో చూసినా అదే తండ్రి పాత్ర కాబట్టి పెద్దగా చెప్పుకునేందుకు లేదు. అల్లు అర్జున్ మాత్రం ఎప్పటిలా తన దైన శైలిలో డాన్స్ లు, హుషారుతో స్క్రీన్ సేవ్ చేసారు. త్రివిక్రమ్ డైలాగుల్లో గతంలో పంచ్ మాయమైంది. అక్కడక్కడ మాత్రమే ప్రాసలు పేలాయి. దర్సకుడు మాత్రం ఓ కొత్త తరహా సినిమాకు ట్రై చేసాడని చెప్పవచ్చు. కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత ట్రిమ్ చేస్తే బావుండేది. పాటల్లో టైటిల్ సాంగ్, మధు..మధు బాగున్నాయి. రీ రికార్డింగ్ చాలా సీన్స్ కు ప్లస్ అయ్యింది.

జులాయి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

జులాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+