జోతిలక్ష్మి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఛార్మి కౌర్, సత్య, వంశీ, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాతలు సి కళ్యాన్, చార్మి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్ స్వరాలు సమకుర్చారు.
కథ
జ్యోతిలక్ష్మి (ఛార్మి) ఓ సెక్స్‌వర్కర్. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్య(సత్యదేవ్) ఆమెను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఉండే చోటకి రోజూ వెళ్తూ...ఓ రోజు ..ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ పెట్టి...ఒప్పించి బయిటకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాడు. మొదట్లో తిక్కగా బిహేవ్ చేసినా తర్వాత సత్య ..నిజమైన ప్రేమకు ఆమె ..అతనితో నిజాయితీగా జీవితం ప్రారంభిద్దామనుకుంటుంది. కానీ ఆమె గత జీవితం ఆమెను వెంబడిస్తుంది. ఆ వ్యభిచార గృహాల (కంపెనీ) రాకెట్ నడిపే...నారాయణ పట్వారీ (అజయ్ ఘోష్) డబ్బు సంపాదించే ఆమెను వదులుకోదలుచుకోడు. అతను చేతిలో పోలీసులు, డబ్బు, రౌడీలు ఉంటారు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అంత పరర్ ఫుల్ విలన్ ని ఆమె ఎలా ఎదుర్కుని తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంది...మిగతా వ్యభిచారుల జీవితాలు సైతం ఎలా నిలబెట్టింది అనేది మిగతా కథ.