మన హీరోయిన్లు అసలు వాయిస్ ఎలావుంటుందో మనలో చాలా మందికి తెలియదు. స్టేజ్ పై వారు అరుదుగా మాట్లాడే తెలుగు మాటలు.. అందరు బాగున్నారా ఆ ఒక్క మాట కూడ మనం వినడానికి కష్టంగా ఉంటుంది. వారి తప్పు కాదు, వారు ప్రాంతీయ భాషలో మాట్లాడలేరు, ఇలాంటి తెలుగు మాట్లాడలేని కొద్దిమంది నటులకు డబ్బింగ్ ఆర్టిస్టులు వారి పాత్రలకు జీవాన్ని ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. తెర ముఖాల వెనుక ఉన్న స్వరాలు సినిమాలో ముఖ్యమైన భాగం. ప్రేక్షకులను పాత్రలతో కనెక్ట్ చేసేలా చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. నటులు / నటీమణులు మన అభిమాన తారలు శృంగారభరితమైన, శక్తివంతమైన మరియు గందరగోళ సంభాషణలను మాట్లాడటానికి వారు నవ్వుతారు, ఏడుస్తారు మరియు అరుస్తారు అన్ని సందర్బాలలోను వారు మాట్లాడినట్టుగానే వుంటుంది. చిన్మాయి వాయిస్ ద్వారా సమంత కి క్రెజ్ మాములుగా రాలేదు ఇంకా ఇలాంటి కాంభినేషన్స్ చాలా వున్నాయి టాలీవుడ్‌లో అత్యుత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.