కాయ్ రాజా కాయ్ సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ ఖన్నా, మానష్, శామిలి సౌందేర్జన్, శ్రావ్య, జొష్ రవి తదితరులు ప్రదాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకత్వం శివ గణేష్ నిర్వహించారు, పుల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్స్ ఫ్రోడక్షన్ లో వి సతీష్ రాజు నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం జె బి స్వరాలు సమకుర్చరు.
కథ
ఖన్నా(రామ్ ఖన్నా), ఆనంద్(మానస్), చిట్టిబాబు(జోష్ రవి) ముగ్గురూ స్నేహితులు. ఖన్నా బైక్ మెకానిక్ పనిచేస్తుండగా, ఆనంద్ ఏదైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నంలో ఉంటాడు.చిట్టీ వారిలా కాకుండా కిడ్నాప్, స్మగ్లింగ్ లాంటివి చేసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో ఉంటాడు. ఖన్నా, ఆనంద్ ప్రేమలో పడతారు...ఈ క్రమంలో వారికి డబ్బులేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిట్టిబాబును డబ్బు సంపాదించడానికి ఈజీగా డబ్బు సంపాదించడానికి ప్లాన్ చేస్తారు. ఇందుకోసం ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. ఓ నగల వ్యాపారిని చంపి కొందరు దుండగులు ఆ పెట్టెను దొంగిలిస్తారు. ఆ బంగారం పెట్టె కోసం గ్యాంగ్ స్టర్ భట్టు(హరి) వెతుకుంటాడు. అనుకోకుండా ఈ ముగ్గురి వద్దకు ఆ బంగారం పెట్టె దొరుకుతుంది. వాళ్ళు దీన్ని అమ్మాలని భట్టు అసిస్టెంట్ తోనే డీల్ మాట్లాడతాడు. దాంతో ఈ ముగ్గురు ఇబ్బందుల్లో పడతారు. ఆర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.