కబ్జా మూవీ యాక్షన్, క్రైమ్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, డా శివ రాజ్ కుమార్, శ్రియా శరన్, మురళి శర్మ, నవాబ్ షా, సుధా తదితరులు నటించారు. ఈ సినిమాకి దార్శకత్వం ఆర్ చంద్రు వహించారు. సంగీతం రవి బాసృర్ అందించారు.
కథ
స్వతంత్ర సమరయోధుడు అమరేశ్వర కుమారుడైన అరకేశ్వర అలియాస్ ఆర్కా (ఉపేందర్) ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అమ్రాపుర రాజ సంస్థానం పాలకుడు వీర్ బహద్దూర్ (మురళీ శర్మ) కుమార్తె మధుమతి (శ్రీయా సరన్) ప్రేమలో ఉంటాడు. పెళ్లి చేసుకొందామనేకునే సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల రౌడీగా, మాఫియా డాన్‌గా మారుతాడు. ఉత్తర భారతం నుంచి తల్లి తులసి దేవీ (సుధ) తన కుమారులు అరకేశ్వర, సంకేశ్వరను తీసుకొని ఎందుకు పారిపోయి దక్షిణాదికి వస్తుంది. దేశభక్తుడైన ఆర్కా తండ్రి ఎలా మరణించాడు? ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసే ఆర్కా ఎందుకు రౌడీగా మారాడు? వీర్ బహద్దూరు నేతృత్వంలోని రాజరిక వ్యవస్థకు రాజకీయ నాయకులకు ఎందుకు వైరం ఉంటుంది? రాజరిక వ్యవస్థ నుంచి వీర్ బహద్దూర్ ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకొంటాడు? మాఫియా డాన్‌గా మారిన ఆరకేశ్వర ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? జైలు నుంచి మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు? మాఫియా చేతిలో బంధింపబడిన మధుమతి జీవితం ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే కబ్జ సినిమా
రిలీజ్ డేట్
ఈ మూవీ మార్చి 17 వ తేదీన దాదాపు 7 భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది