కేడి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం, లిండా, అంకుర్, నిర్మల్ పాండే, అఖిలేంద్ర మిశ్రా, కెల్లీ దోర్జి, సాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వమ్ కిరణ్ నిర్వహించారు మరియు నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకుర్చారు.
కథ
ఉషారైన రమేష్ ఉరఫ్ రమ్మీ(నాగార్జున) చిన్నప్పుడే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ బాల్య ప్రేమ వికసిస్తుంది అనుకుంటూండగా పెద్దలుకు తెలిసి మాడిపోతుంది. దాంతో మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని రమేష్ ప్రపోజల్ పెడితే ఆ పిల్ల వద్దు...నువ్వు నన్ను ఏం పెట్టి పోషిస్తావు అని నిలదీస్తుంది. దాంతో రమేష్ కి డబ్బే జీవితం అనే జీవిత సత్యం తెలిసి కేడిలా మారతాడు. వరసగా దొంగతనాలు తో ఎదిగి కాలక్రమేణా చంద్ర(అంకుర్) వంటి స్మగ్లర్స్ తో సంభందాలు ఏర్పడి పెద్ద పెద్ద డీల్స్ చేస్తూంటారు. ఆ క్రమంలో అతనికి సంధ్య(మమతా మోహన్ దాస్) పరిచయం అవుతుంది. అప్పటికే భర్త చనిపోయి ఓ పిల్లాడు ఉన్న ఆమె రమ్మీ చెంత చేరి అతన్ని మార్చటానికి ట్రై చేస్తుంది. అదిష్టం లేక వెళ్ళిపోతున్న రమ్మికి ఆమె గురించి ఓ షాకయ్యే విషయం తెలుస్తుంది. అది పరిష్కరించుకునేలోగా చంద్రం అతని పాలిట విలన్ గా తయారవుతాడు. అప్పుడు రమ్మీ ఏం చేసాడు...సంధ్య ఏమైంది అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.