X
కేడి

కేడి

Action | Romance | 12 Feb 2010 | U/A |
Telugu

3.1 /5 Users

1.5 /5 Filmibeat

కేడి స్టోరీ

కేడి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, మమతా మోహన్‌ దాస్‌ , బ్రహ్మానందం, లిండా, అంకుర్‌, నిర్మల్‌ పాండే, అఖిలేంద్ర మిశ్రా, కెల్లీ దోర్జి, సాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వమ్ కిరణ్ నిర్వహించారు మరియు నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకుర్చారు. కథ ఉషారైన రమేష్ ఉరఫ్ రమ్మీ(నాగార్జున) చిన్నప్పుడే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ బాల్య ప్రేమ వికసిస్తుంది అనుకుంటూండగా పెద్దలుకు తెలిసి మాడిపోతుంది. దాంతో మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని రమేష్ ప్రపోజల్ పెడితే ఆ పిల్ల వద్దు...నువ్వు నన్ను ఏం పెట్టి పోషిస్తావు అని నిలదీస్తుంది. దాంతో రమేష్ కి డబ్బే జీవితం అనే జీవిత సత్యం తెలిసి కేడిలా మారతాడు. వరసగా దొంగతనాలు తో ఎదిగి కాలక్రమేణా చంద్ర(అంకుర్) వంటి స్మగ్లర్స్ తో సంభందాలు ఏర్పడి పెద్ద పెద్ద డీల్స్ చేస్తూంటారు. ఆ క్రమంలో అతనికి సంధ్య(మమతా మోహన్ దాస్) పరిచయం అవుతుంది. అప్పటికే భర్త చనిపోయి ఓ పిల్లాడు ఉన్న ఆమె రమ్మీ చెంత చేరి అతన్ని మార్చటానికి ట్రై చేస్తుంది. అదిష్టం లేక వెళ్ళిపోతున్న రమ్మికి ఆమె గురించి ఓ షాకయ్యే విషయం తెలుస్తుంది. అది పరిష్కరించుకునేలోగా చంద్రం అతని పాలిట విలన్ గా తయారవుతాడు. అప్పుడు రమ్మీ ఏం చేసాడు...సంధ్య ఏమైంది అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

కేడి కాస్ట్ & క్రూ

కేడి సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిరణ్ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సందీప్ చౌత
నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కేడి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొత్త దర్శకుడుతో సినిమా చేస్తున్నాను..డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసాడు అని నాగార్జున ఒకటికి పదిసార్లు మీడియా ముందుకు వచ్చి చెప్తూంటే ఏమో మళ్ళీ ఏ 'శివ' లాంటి అధ్బుతమో జరుగుతుందని ఆశపడటం సహజం. అయితే కొత్తదనం పేరు చెప్పి విపరీతమైన స్లో నేరేషన్ తో విచిత్రమైన ట్విస్టులతో సినిమా వస్తుందని ఏ మాత్రం ఊహించం. కేడీకి అదే జరిగింది. ప్రేక్షకుడుని దర్శకుడు కేడీలా మారి వంచించాడు. కొత్త(నేరేషన్ లేదా దర్శకుడు) అంటేనే భయపడేలా సినిమా తీసి, సహన పరీక్ష పెట్టాడు. అలాగే తన దర్శకత్వంకు తగినట్లే అన్ని విభాగాలు చాలా నీరసంగా పనిచేసేటట్లు చూసుకున్నాడు.దాంతో ఈ చిత్రం అభిమానులకైనా నచ్చుతుందా అంటే సందేహమే అన్నట్లు తయారైంది. కేవలం నాగార్జన నటన మాత్రమేఅంత నసలోనూ జనాల్ని చివర దాకా కూర్చొపెట్టగలిగింది.

కేడి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
3.1 /5 Your Rating

కేడి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+