X
ఖిలాడి
Action | Thriller | 11 Feb 2022 | U/A | 154 Mins
Telugu

ఖిలాడి స్టోరీ

ఖిలాడి సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్ సర్జ, వెన్నెల కిషోర్, మురళి శర్మ, రావు రమేష్, అనసూయ, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ వహించారు. నిర్మాత సత్యనారాయణ కోనేరు నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.  

కథ

గాంధీ (రవి తేజ) డబ్బు సంపాదించాలనే విపరీతమైన కోరిక ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్. 10 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉంటాడు. గాంధీ జీవితంపై రీసెర్చ్ చేస్తున్న పూజ (మీనాక్షి చౌదరీ) అతడిని జైలులో కలుసుకొంటుంది. అయితే పూజను తాను అల్లిన కట్టుకథతో బోల్తా కొట్టించి జైలు నుంచి తప్పించుకొంటాడు. అయితే జైలులో పూజకు గాంధీ చెప్పిన కట్టుకథ ఏమిటి? జైలు నుంచి తప్పించుకొన్న గాంధీ ఏం చేశాడు? ఖిలాడీ కథలో గాంధీకి రామకృష్ణ (ఉన్ని ముకుందన్) పాత్రకు ఉన్న సంబంధమేమిటి? తన భార్య చిత్ర (డింపుల్ హయతీ), తన అత్తమామలు పుట్టపర్తి, చంద్రకళ (అనసూయ, మురళీశర్మ)తో గాంధీ చేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటి? గాంధీ ఎత్తులకు సీబీఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ (అర్జున్ సర్జా) వేసిన పై ఎత్తు ఏమిటి? రాజకీయ నేత గురు సింగం (ముఖేష్ రుషి), అతడి కొడుకు బాల సింగం (నిక్తిన్ ధీర్)‌ను 10 వేల కోట్ల విషయంలో ఎలా బోల్తా కొట్టించాడు? గాంధీ ఆడిన నాటకంలో డీఐజీ జయరాం (సచిన్ కేడ్కర్), పెంపుడు తండ్రిగా చెప్పుకొనే రాజశేఖర్ (రావు రమేష్) పాత్రలు ఏమిటి? చివరకు 10 వేల కోట్ల రూపాయలను గాంధీ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఖిలాడీ సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+