X
Home టాప్ లిస్టింగ్

క్రాక్ నుంచి రావణాసుర వరకు రవితేజ లాస్ట్ 5 మూవీస్ బిజినెస్ డీటైల్స్

Author Administrator | Updated: Friday, April 7, 2023, 04:56 PM [IST]

మాస్ మహా రాజా రవి తేజ చాలా చిన్న స్థాయి నుండి ప్రస్తుతం స్టార్ హీరో స్థాయికి ఎదిగిన విషయం మన అందరికీ తెలిసింది. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో , విలన్ పాత్రల్లో , ముఖ్య పాత్రల్లో నటించిన రవితేజ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమా లలో హీరో గా నటిస్తున్నాడు. రవి తేజ రావణాసుర మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7వ విడుదలైంది . ఈ నేపథ్యంలో రవితేజ నటించిన గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే.


cover image
క్రాక్
1

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా  క్రాక్. శృతి హాసన్ హీరోయిన్‌గా, స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ వంటి స్టార్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 39.16 కోట్ల షేర్ ను రాబట్టింది. 

ఖిలాడి
2

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ  ఖిలాడీ. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. ఫిబ్రవరి 11న విడుదలై ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం రూ.13.55 కోట్ల షేర్ ను రాబట్టింది.

రామారావు ఆన్ డ్యూటీ
3

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన  రామారావు ఆన్ డ్యూటీ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకి  రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కేవలం రూ.5.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.  రూ.12.53 కోట్ల నష్టాలను మిగిల్చింది.

ధమాకా
4

రవితేజ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద 19 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే. ఈ సినిమా 86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 

రావణాసుర
5

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఏప్రిల్ 7న రిలీజ్ రాబోతున్న కొత్త సినిమా రావణాసుర.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 23 కోట్లు రాబట్టాలి. ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ అలాగే దక్ష నగర్కర్ లు ఫీమేల్ లీడ్ లో నటించారు . 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+