X
కిక్ 2
Comedy | Romance | 21 Aug 2015 | U/A |
Telugu

కిక్ 2 స్టోరీ

కిక్ 2 సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, రకుల్ ప్రితి సింగ్, బ్రహ్మనందం, రాజ్ పాల్ యాదవ్, రఘు అదుర్స్, రవి కిషన్, నికితిన్ దీర్, సంజై మిశ్ర, అశిస్ విద్యార్తి, కోవై సరళ, పోసాని క్రిష్ణా మురళి, కబీర్ దుహన్ సింగ్, నోరా పతేహి తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్రర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కల్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ యస్ యస్ స్వరాలు సమకుర్చారు.

కథ

రాబిన్ హుడ్ (రవితేజ)కి బాగా చిన్నప్పటి నుంచి అంటే కడుపులో ఉన్నప్పటినుంచీ కంఫర్ట్ గా ఉండటం అంటే ఇష్టం. తొమ్మిదినెలలు లోపల ఏం ఉంటాం అని కంఫర్ట్ కోసం 7వ నెలలోనే బయిటకు వచ్చేసి, తండ్రి కిక్ కు సైతం తన కంఫర్ట్ కోసం చుక్కలు చూపిస్తాడు. అలా తనకు కంఫర్ట్ మిస్సైతే ఎదుటి వాడి మనస్సాంతిని మిస్ చేసే ఈ రాబిన్ హుడ్...అమెరికాలో ఉంటూ హాస్పటిల్ కట్టాలని, అందుకు అవసరమయ్యే డబ్బు కోసం తన వారసత్వ ఆస్ధులు అమ్ముకోవటానికి ఇండియా వస్తాడు. అక్కడ అతనికి చైత్ర(రకుల్ ప్రీతిసింగ్)పరిచయం అవుతుంది. మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఈ లోగా ఆమె కిడ్నాప్ అవుతుంది. ఆమెను వెతుక్కుంటూ బీహార్ లోని విలాస్ పూర్ అనే విలేజ్ కు వెళ్తాడు. ఆ ప్రాంతాన్ని సోలమాన్ సింగ్ ఠాకూర్(రవి కిషన్), అతని కొడుకు మున్న(కబీర్ సింగ్) కనుసన్నల్లో ఉంటుంది. అతను జనాలను బానిసలుగా చేసి వాడుకుంటూ ఉంటాడు. తన కంఫర్ట్ కు భంగం రానంతవరకూ ఏ గొడవల్లోకి వెళ్లని రాబిన్ హుడ్ అతనితో తలపడి ఆడుకోవాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ పరిస్ధితిలు ఏమిటి...వాటిని క్రియేట్ చేసిందెవరు..ఇంతకీ చైత్రను కిడ్నాప్ చేసిందెవరు...వీటిన్నిటి వెనక ఉన్న అసలు కథ ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+