కింగ్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, త్రిష, మమతా మోహన్ దాస్, శ్రీహరి, బ్రహ్మానందం, షాయీజి షిండే, కృష్ణ భగవాన్, గీత, ధర్మ వరపు, చంద్రమోహన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు
కథ
దాదాగిరి లోకి కొత్తగా ఎంటర్ అయిన బొట్టు శ్రీను(నాగార్జున)మంచికి సపోర్టు ఇస్తూంటాడు . అలాగే సిటీలో అప్పటికే ఆ వృత్తిలో సెటిలయిన లోకల్ డాన్ జ్ఞానేశ్వర్(శ్రీహరి)ని ఎదిరిస్తాడు. అంతేగాక జ్ఞానేశ్వర్ ముద్దుల చెల్లెలు శ్రావణి(త్రిష)తో ప్రేమలో పడతాడు. అయితే సింగర్ గా ట్రై చేస్తున్న శ్రావణి జీవితాశయం ఈ దాదాగిరిలకు దూరంగా ఓ మంచి కుర్రాణ్ని చూసి పెళ్ళి చేసుకోవాలని. అందులో భాగంగా ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. శ్రీను ని శరత్ (సునీల్) అనే ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుకుని పొరబడి ప్రేమిస్తుంది. సర్లే ఆమె ప్రేమలో పడటమే ముఖ్యమనుకున్న శ్రీను..శరత్ ని తప్పించి ఆ ప్లేసులో కంటెన్యూ అవుతూంటాడు. జ్ఞానేశ్వర్ మొదట అనుమానించినా తర్వాత నమ్మి ఓ రోజు ఎంగేజమెంట్ ఫిక్స్ చేస్తారు. అయితే ఆ సమయంలో అతన్ని కింగ్ గా గుర్తు పట్టి కొందరు వెంబడించి చంపటానికి ప్రయత్నిస్తారు.ఇంతకీ కింగ్ ఎవరు..శ్రీనుకి..కింగ్ కి సంభంధం ఏమిటి...శరత్ గా శీను ఆడుతున్న నాటకం బయిటపడిందా..అన్నది తెరపైన చూడాల్సిందే..