కోత్త బంగారు లోకం సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ శందేష్, శ్వేతా ప్రసాద్, ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం:శ్రీకాంత్ అడ్డాల నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
కొడుకుని విపరీతంగా ప్రేమించే కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు బాలు(వరుణ్ సందేష్). కూతుర్ని అతి జాగ్రత్తగా పెంచుతున్న ఫ్యామిలీనుండి వచ్చిన అందాల అమ్మాయి స్వప్న(శ్వేతా ప్రసాద్). ఇద్దరూ ఇంటర్ కోసం ఒకే రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ అవుతారు. అయిందే తడువుగా వారిద్దరకీ రాసిపెట్టి ఉన్నట్లు ప్రేమలో పడతారు.ఈ విషయం తెల్సిన స్నప్న తండ్రి( ఆహుతి ప్రసాద్) ఊరుకుంటాడా...కూతుర్ని ఇంటిలోనే బంధించి విడతీయాలని ప్రయత్నిస్తాడు. మరి యువ హృదయాలు కలవకుండా ఆగుతాయా...అంటే సినిమా చూడాల్సిందే.