కౌసల్య కృష్ణమూర్తి (ది క్రికెటర్) సినిమా క్రికెట్ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ ఇందులో ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, శివకార్తికేయన్ (స్పెషల్ రోల్), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సీవీఎల్ నరసింహారావు, వెన్నెల కిశోర్, 'రంగస్థలం' మహేశ్, విష్ణు (టాక్సీవాలా ఫేమ్), రవిప్రకాశ్ తదితరులు నటించారు. ఈ సినిమాని భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె ఎ వల్లభ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అరుణ్ రాజా కామారాజ్ అందించారు.
కథ
ఆంధ్రాలోని ఓ మారుమూల ప్రాంతంలోని రైతు కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్)కు క్రికెట్, భారత జట్టు అంటే చెప్పలేనంత అభిమానం. పంట చేతికి రాక, దురదృష్టం వెంటాడటంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణమూర్తి కూతురు కౌసల్య (ఐశ్వర్య రాజేష్)ను ఓ సంఘటన కదిలించడంతో క్రికెటర్‌గా మారాలనుకొంటుంది. పల్లెటూరులో ఆడపిల్లగా క్రికెట్ ఆడేందుకు, నేర్చుకొనేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతు కృష్ణమూర్తికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తన కూతురును క్రికెటర్ చేయాలనే కలను ఎలా సాకారం చేసుకొన్నాడు. క్రికెటర్ కావాలనుకునే యువతిగా కౌసల్య కృష్ణమూర్తి ఎలాంటి చేదు అనుభవాలను ఎదురు చూసింది. క్రికెట్ కోచ్ నెల్సన్ (శివ కార్తీకేయన్) పాత్ర ఏంటీ? ఏ పరిస్థితుల్లో భారత మహిళల జట్టుకు శివ కార్తీకేయన్ కోచ్‌గా వచ్చాడనే ప్రశ్నలకు సమాధానమే కౌసల్య కృష్ణమూర్తి చిత్రం.