కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)(U/A)
Release date
12 Feb 2016
genre
కృష్ణగాడి వీరప్రేమగాధ స్టోరి
కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మెహరీన్, సంపత్ రాజ్, మురళి శర్మ, బ్రహ్మాజి, పృద్వి, హరీష్ ఉత్తమన్, సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి నిర్వహించారు మరియు నిర్మాతలు అనిల్ సుంకర, గోపీ ఆచంట, రామ్ ఆచంట ముగ్గురు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకుర్చరు.
కథ
అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన కృష్ణ(నాని) బాలయ్యకు పెద్ద అభిమాని. ఎంతంటే చేతిపై జై బాలయ్య అని పచ్చబొట్టు వేయించుకునేంత. చూట్టూ ఫ్యాక్షన్ వాతావరణం ఉన్నా నాని మాత్రం గొడవలకు చాలా దూరం. ఒక రకంగా గొడవలంటే భయం. అదే గ్రామంలో మహాలక్ష్మి(మెహరీన్), కృష్ణ చిన్నతనం నుండి ప్రేమించుకుంటారు. కానీ బయటకు మాత్రం అలా కనిపించరు. మహాలక్ష్మి అన్నయ్య రామరాజు పెద్ద ఫ్యాక్షనిస్ట్. అతనంటే అందరికీ భయం అందుకే కృష్ణ, మహాలక్ష్మిలు కూడా తమ ప్రేమ విషయాన్ని బయట పడుకండా జాగ్రత్త పడతారు. కనీసం తమ స్నేహితుల వద్ద కూడా ఆ విషయంలో బయట పడరు. పైకి ఇద్దరూ ఎప్పూడు పోట్లాడుకున్నట్లు నటిస్తారు. ఒకరోజు ధైర్యం చేసిన తన ప్రేమ విషయం చెబుతాడు కృష్ణ. అయితే మహాలక్ష్మి అన్నయ్య తాను చెప్పిన పని చేస్తే తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. మరి అతడు కృష్ణకు అప్పగించిన పనేంటి? అసలే భయస్తుడైన కృష్ణ తన ప్రేమను ఎలా గెలచుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie కృష్ణగాడి వీరప్రేమగాధ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు