X
కృష్ణాష్టమి
Action | Romance | 19 Feb 2016 | U/A |
Telugu

కృష్ణాష్టమి స్టోరీ

కృష్ణాష్టమి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, నిక్కి గిల్రాణి, డింపుల్, బ్రహ్మానందంఅశుతోష్ రాణా, పవిత్ర లోకేష్, ముకేష్ రిషి, పోసాని కృష్ణా మురళి, సుమన్, సప్తగిరి, తులసి శివమణి తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వాసు వర్మ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దినేష్ కనగరత్నం స్వరాలు సమకుర్చరు. 

కథ

కృష్ణ (సునీల్) ఓ ఎన్నారై. చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోయిన అతనికి ఎప్పటినుంచో ఇండియా రావాలని కోరిక. అయితే...ఇండియాకు వస్తానంటే అతని పెదనాన్న రామ చంద్రరావు(ముఖేష్ రుషి) అడ్డు పడుతూంటాడు. విసుగెత్తిపోయిన కృష్ణ ఓ రోజు చెప్పాపెట్టకుండా ఇండియాకు బయిలు దేరతాడు. ఆ జర్నీలో పల్లవి (నిక్కీ గల్రాని) తో పనిలో పనిగా ప్రేమలో పడి, ఆమెను లైన్ లో కూడా పెట్టేస్తాడు. ఇదే జర్నీలో కృష్ణకి ..అజయ్ (అజయ్) అతని కొడుకు పరిచయమవుతారు. వాళ్లపై ఎటాక్ జరగటంతో వాళ్ళని రక్షించి తన కారులో తీసుకు వస్తూంటాడు. అయితే వాళ్లపై మరోసారి ఎటాక్ జరిగి. అజయ్ కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పుడు కృష్ణ ...అజయ్ కొడుకుని తీసుకుని అజయ్ అత్తారింటికి బయిలుదేరతాడు. ఆ పిల్లవాడిని ఆ ఇంట్లో అప్పచెప్దామని వెళ్ళీపోదామనుకుంటే.. వాళ్లంతా ..సునీల్ ని ..చాలా కాలం తర్వాత తమ ఇంటికి వస్తున్న అల్లుడు, మనవడు గా పొరబడతారు. తానెవరో చెప్పే అవకాసం రాదు. దాంతో కొద్ది రోజులు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో అతనికో నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో వాళ్లు తను ఎవరో తెలియకుండా తనని చంపటానికి ప్రయత్నాలు చేస్తున్నారని. అది తెలుసుకున్న కృష్ణ ఏం చేసాడు... వారు చంపాలనుకోవటానికి కారణం ఏమిటి...తన పెదనాన్నే తనని ఇండియా ఎందుకు రానివ్వటం లేదు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+