లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్, ఆదుకలం నరేన్, సప్తగిరి, బ్రహ్మాజి, మిమే గోపి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మేర్లపాక గాంధీ వహించారు. నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మించారు. చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
కథ
విప్లవ్ (సంతోష్ శోభన్) ట్రావెల్ బ్లాగ్ నడిపే యూట్యూబర్. డీజీపీ కూతురు వసుధ (ఫరియా అబ్దుల్లా) కూడా యూట్యూబర్. అయితే వీరిద్దరూ అడ్వెంచరస్ జర్నీ చేస్తూ ఒకరినొకరు కలుసుకొంటారు. అయితే అడవుల్లో ఏపీ పోలీసులకు, నక్సలైట్ నాయకుడు బ్రహ్మన్న (బ్రహ్మాజీ)కి మధ్య జరుగుతున్న పోరాటంలో విప్లవ్, వసుధ చిక్కుకుంటారు. ఏపీ పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఘర్షణకు కారణమేమిటి? పోలీసులకు, నక్సలైట్ల పోరాటం మధ్య చిక్కుకున్న విప్లవ్, వసుధకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? విప్లవ్, వసుధ మధ్య ప్రేమగా మారిన పరిచయం ఎక్కడి వరకు వెళ్లింది? విప్లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత వసుధ ఎలా రియాక్ట్ అయింది? విప్లవ్ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది? పోలీసులకు, నక్సలైట్లకు మధ్య శాంతి చర్చలకు పరిష్కారం లభించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ.