X
Home టాప్ లిస్టింగ్

తెలుగు హీరోల‌కు షాకిచ్చిన కోలీవుడ్ డైరెక్టర్స్‌ ఎవరెవరంటే!

Author Administrator | Updated: Friday, June 16, 2023, 08:14 PM [IST]

త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చి వాటి అనువాదాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయిన కోలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఎంద‌రో. వారి టేకింగ్ చూసిన మన టాలీవుడ్ స్టార్స్ వారితో సినిమాలు చేయ‌టానికి రెడ్ కార్పెట్ ప‌రిచారు. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌లైన తెలుగు హీరో - కోలీవుడ్ డైరెక్ట‌ర్ కాంబోలో సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్క బోర్లా ప‌డ్డాయి. అలాంటి డైరెక్ట‌ర్స్‌, వారి సినిమాలను కొన్నింటిని చూద్దామిప్పుడు...


cover image
ఎస్ జె సూర్య
1

త‌మిళంలో ఖుషి సినిమాను డైరెక్ట్ చేసి అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన డైరెక్ట‌ర్ ఎస్‌.జె.సూర్య తెలుగులోనూ అదే టైటిల్ పెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. దీంతో వెంట‌నే సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న‌తో నాని సినిమా చేశారు. ఆ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత త‌మిళంలోనే సినిమాలు చేస్తూ వ‌చ్చిన ఆయ‌న త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పులి సినిమాను అనౌన్స్ చేయ‌గానే అంద‌రిలో అంచ‌నాలు పీక్స్‌కి  చేరుకున్నాయి. కానీ తీరా ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్‌గా నిలిచింది. దీంతో అభిమానులు నిరుత్సాహ ప‌డ్డారు.  

ధరణి
2

త‌మిళంలో విక్ర‌మ్‌తో ధూళ్ వంటి మాస్ సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ధ‌ర‌ణితో సినిమా చేయ‌టానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. బంగారం అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌త్తా లేకుండా పోయింది. 

 

కె ఎస్ రవికుమార్
3

త‌మిళంలో ర‌జినీకాంత్‌, అజిత్ వంటి స్టార్స్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్స్ తెర‌కెక్కించిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వికుమార్ తెలుగులో బాల‌కృష్ణ‌తో చేసిన సినిమా రూల‌ర్‌. ఈ మూవీ విడుద‌ల తొలి ఆట‌కే ప్లాప్ తెచ్చుకుని ఊసే లేకుండా పోయింది.  

పి వాసు
4

తమిళంలో ర‌జినీకాంత్‌తో చంద్ర‌ముఖి చిత్రాన్ని తెర‌కెక్కించి త‌మిళంలో, అదే అనువాదంతో తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు పి.వాసు. దీనికి కొన‌సాగింపును తెలుగులో మాత్ర‌మే రూపొందించారు. అది కూడా నాగ‌వ‌ళ్లి పేరుతో. చంద్ర‌ముఖిలో ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తే... దానికి కొన‌సాగింపుగా వ‌చ్చిన తెలుగు నాగ‌వ‌ళ్లిలో మాత్రం వెంక‌టేష్ హీరోగా న‌టించారు. సినిమా మాత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచి అంద‌రినీ నిరుత్సాహ ప‌రిచింది. 

గౌతమ్ మీనన్
5

త‌మిళంలో కాక్కా కాక్కా, మిన్న‌ల్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ తెర‌కెక్కించిన గౌత‌మ్ మీన‌న్ తెలుగులోనూ కాక్కా కాక్కాను ఘ‌ర్ష‌ణ‌గా, విన‌తాండి వ‌రువాయ చిత్రాన్ని ఏ మాయ చేసావెగా రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. అదే న‌మ్మ‌కంతో నాని, స‌మంత ఆయ‌న‌తో ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు సినిమా చేశారు. ఆ సినిమా మ్యూజికల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, బాక్సాఫీస్ పోరులో చ‌తికిల ప‌డింది. 

ఎ ఆర్ మురుగదాస్
6

త‌మిళంలో ర‌మ‌ణ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ఎ.ఆర్‌.మురుగ‌దాస్ త‌ర్వాత త‌మిళంలో గ‌జిని సినిమాను సూర్య‌తో రూపొందిస్తే అటు త‌మిళంలో, దాని అనువాదం తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మురుగ‌దాస్‌తో స్టాలిన్ సినిమా చేస్తే ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్పైడ‌ర్ అనే సినిమా చేశారు. అది కూడా ఏక కాలంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తే ఊహించ‌ని విధంగా ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. 

 

ఆనంద్ శంకర్
7

అరిమ నంబి (తెలుగులో డైన‌మైట్‌) సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఆనంద్ శంక‌ర్.. త‌ర్వాత విక్ర‌మ్‌తో ఇరుముగం సినిమా చేసి హిట్ అందుకున్నారు. దీంతో తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆనంద్ శంక‌ర్‌తో సినిమా చేశారు. అది కూడా తెలుగు, త‌మిళంలో. ఆ సినిమాయే నోట‌. పొలిటిక‌ల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ పోరులో చ‌తికిల ప‌డింది. 

ఎన్ లింగుస్వామి
8

త‌మిళంలో విశాల్‌తో లింగుసామి చేసిన సండై కోళి సినిమా తెలుగులో పందెం కోడిగా రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. దీంతో లింగుస్వామితో సినిమాలు చేయ‌టానికి మేక‌ర్స్ ఆస‌క్తి చూపించారు. ఈ నేప‌థ్యంలో యంగ్ హీరో రామ్ పోతినేని .. తెలుగు, త‌మిళ భాష‌ల్లో చేసిన సినిమా ది వారియ‌ర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌టంలో ఊసూరుమ‌నిపించింది. 

రంజిత్ జయకొడి
9

త‌మిళ ద‌ర్శ‌కుడు రంజిత్ జ‌య‌కోడి తెలుగు హీరో సందీప్ కిష‌న్ మైకేల్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తే అస‌లు అడ్ర‌స్ లేకుండా పోయింది మ‌రి. 

వెంకట్ ప్రభు
10

త‌మిళంలో మానాడు వంటి ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు.. నాగ చైత‌న్య‌తో క‌స్ట‌డీ సినిమా చేశాడు అది కూడా తెలుగు, త‌మిళంలో. సినిమా బావుంద‌నే టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టంలో మాత్రం విఫ‌ల‌మైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+