లిసా సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అంజలి, శ్యామ్ జోన్స్, మక్రంద్ దేశ్పాండే, యోగి బాబు, మిమే గోపి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజు విశ్వనాథ్ వహించారు మరియు నిర్మాత సురేష్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ ధయనిధి అందించారు.
స్టోరి
లీసా (అంజలి) అమెరికాలో చదువు కోసం వెళ్లాలన్ని ప్రయత్నిస్తుంటారు. తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. అయితే మధ్య వయసులో ఉండే తల్లిని పెళ్లి చేసుకోమని వెంటపడి ఒప్పిస్తుంది. పేరేంట్స్ ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లి పెళ్లి చేసుకోవడంతో వారికి దూరమవుతుంది. వారిని కూడా ఒప్పించి పెళ్లి చేయాలనే ప్లాన్‌తో తన అమ్మమ్మ, తాత వద్దకు వెళ్తుంది. అక్కడికి వెళ్లిన లీసాకు భయంకర నిజాలు తెలుస్తాయి. అమ్మమ్మ, తాతను కలిసే ప్రయత్నంలో లీసాకు ఎదురైన సమస్యలు ఎంటీ? తన తల్లికి పెళ్లి చేయడంలో సఫలమైందా? అమ్మమ్మ ఊర్లో లీసాకు తెలిసిన భయంకరమైన విషయాలు ఏమిటి? ఈ కథలో డీజే (మకరంద్ దేశ్ పాండే) రోల్ ఏమిటి? బ్రహ్మనందం, యోగిబాబు పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లీసా స్టోరి.