లవ్ యు బంగారమ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాహుల్, రాజీవ్, శ్రావ్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోవి నిర్వహించారు మరియు నిర్మాతలు: వల్లభ, మారుతి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహిత్ స్వరాలు సమకుర్చారు.
కథ
మొబైల్ కంపెనీలో పనిచేసే ఆకాష్(రాహుల్),మీనాక్షి(శ్రావ్య)తో ప్రేమలో పడతాడు. అయితే వాళ్ళ ప్రేమని పెద్దలు మధ్య పొలిటకల్ విభేదాలు ఉండటంతో ఒప్పుకోరు. దాంతో ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొంతకాలానికి ఆమె జాబ్ లో జాయిన్ అవుతుంది. అప్పటినుంచి వారి జీవితం మలుపు తిరుగుతుంది. వారి జీవితంలోకి మదన్ (రాజీవ్) రావటంతో సమస్యలు వస్తాయి. ఇన్ సెక్యూర్ ఫీలింగ్ తో ఉండే రాహుల్ కి ఆమెపై అనుమానం మొదలవుతుంది. మీనాక్షి కూడా దానికి తగినట్లే బిహేవ్ చేస్తుంది. దాంతో ఆకాష్ లో అనుమానం పెరిగి పెద్దదై తీవ్రరూపం దాలుస్తుంది. ఇంతకీ మదన్ ఎవరు..ఆమె కూడా అలా అనుమానం కలిగేలా ఎందుకు బిహేవ్ చేసింది...చివరకు ఏమైందనే విషయం తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.