twitter

    లక్కున్నోడు స్టోరి

    లక్కున్నోడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, హన్సిక, వెన్నెల కిశోర్, ప్రబాస్ శ్రీను, రఘు బాబు, సత్యం రాజేష్, తనికెళ్ళ భరణి, సుధ, పోసాని కృష్ణ మురళి, తదితరులు నటించాారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజ్ కిరణ్ నిర్వహించారు మరియు నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు  అందించారు.

    కథ

    రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకుల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న రూ.25 కోట్ల నోట్ల‌ని దొంగతనం చేస్తాడు జీకే. అయితే అతను డైరక్ట్ గా ఇన్వాల్స్ కాకుండా...త‌ను వేసిన ప్లాన్ ప్ర‌కారం ఆంటోనీ ఆ సొమ్ము దొంగతనం చేయిస్తాడు. అయితే... జీకేకి వాటా ఇవ్వ‌కుండా ఆ డ‌బ్బుతో ప‌రార‌వుతాడు. అప్ప‌టి నుంచీ.. ఆంటోనీ కోసం జీకే వేటాడుతుంటాడు. పుట్టిన దగ్గరనుండీ...లక్కీ(విష్ణు)ని దురదృష్టం వెంటాడుతూంటుంది. కుటుంబానికి కూడా అతని దురదృష్టం పట్టుకునేసరికి...లక్కీ తండ్రి భక్త వత్సలం (జయప్రకాష్‌) కూడా అతనితో మాట్లాడడు...ద్వేషం పెంచుకుంటాడు. అంతెందుకు పేరు పెట్టేడప్పుడు కూడా ఇబ్బంది రావటం వల్ల పేరు కూడా పెట్టకుండా వదిలేస్తారు. అలా అవమానపడుతూ పేరు లేకుండానే పెరిగిన లక్కీ, ఉద్యోగం కోసం హైదరాబాద్ బయిలుదేరుతాడు. హైదరాబాద్ వచ్చేసి ఫ్రెండ్ (సత్యం రాజేష్) దగ్గరికి వస్తాడు. కానీ అతని దురదృష్టం వల్ల...లక్కీ రాగానే ఆ ఫ్రెండ్ దివాలా తీసి వీధిన పడతాడు. అలాంటి పరిస్దితుల్లో ...పాజిటివ్ పద్మ (హన్సిక) పరిచయమవుతుంది. ఆమె కుటుంబం అంతా పాజిటివ్ నెస్ తో కళకళ్లాడుతుంది. తమ ఇంట్లో అందరూ కీడు జరిగినా పాజిటివ్ గానే ఆలోచించే రకం. అయితే పాజిటివ్ పద్మ లక్కీకి పరిచయమైనా అతడిని దురదృష్టం వెంటాడటం మానదు. తనకి రావాల్సిన ఉద్యోగం ఆమెకొస్తుంది. ఈ లోగా ఇలావుండగా, చెల్లెలి నిశ్చితార్థానికి ఇంటికి వెళ్తాడు లక్కీ. అక్కడ కట్నం డబ్బు రూ.25లక్షలు ఇవ్వడానికి వెళ్తే బ్యాగ్‌ ఎక్కడో పోతుంది. దీంతో చెల్లి పెళ్లి ఆగిపోతుంది. దాంతో తండ్రి కోప్పడటంతో లక్కీ ఆత్మహత్యకు యత్నిస్తాడు. ఈ లోగా... ఒక క్రిమినల్ వచ్చి, తన దగ్గరున్న బ్యాగు ఓ రోజు అతని దగ్గర పెట్టుకుంటే కోటి రూపాయలిస్తానని ఆఫర్ చేస్తాడు- లక్కీ తన లక్ దారిలో పడిందని ఓకే అంటాడు. అక్కడ నుంచి అతని కష్టాలు మొదలవుతాయి. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏమున్నాయి అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి దొంగతనం చేసిన పాతిక కోట్లు. ఆ ఆంటోనీ త‌న ద‌గ్గ‌రున్న పాతిక కోట్లు ల‌క్కీ చేతిలో పెట్టి చ‌నిపోతాడు. పాతిక కోట్లు ల‌క్కీకే ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ డ‌బ్బు చేతికి చిక్కాక ల‌క్కీ జీవితం ఎలా మారిపోయింది? అనేదే క‌థ‌.
    **Note:Hey! Would you like to share the story of the movie లక్కున్నోడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X