మధుమతి సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉదయ బాణు, సీత, తెలంగాన శకుంతల విష్టు ప్రియన్, నల్ల వేణు తదితురులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత రాజ్ శ్రీధర్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాజ్ కిరణ్ స్వరాలు సమకుర్చారు.
కథ
కథ విషయానికొస్తే...పెళ్లంటే అసలు ఇష్టం లేని కార్తీక్ (విష్ణు ప్రియన్) ఇంట్లో వాళ్లు ఖాయం చేసిన బంధువుల సంబంధం నుంచి తప్పించుకోవడానికి తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నానని అబద్దం చెబుతాడు. భార్యను తీసుకురమ్మని కార్తీక బామ్మ(తెలంగాణ శకుంతల) బలవంతం పెట్టడంతో....ఏం చేయాలో తోచక వేశ్య అయిన మధుమతి(ఉదయభాను)కి డబ్బుఇచ్చి కొంతకాలం తన భార్యగా నటించమని కోరతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది తర్వాతి కథ.