మల్లన్న సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, శ్రియ, కృష్ణ, ఆశిష్ విధ్యార్థి, ప్రభు, వై.జి.మహదేవన్, ముకేష్ తివారి, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలొ నటిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుశీ గణేషన్ నిర్వహించారు మరియు నిర్మాత కాలై పులి థాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
మల్లన్న(విక్రమ్) ఓ CBI అధికారి. అవినీతి నిరోధక శాఖలో కృష్ణారావ్(కృష్ణ) కింద పనిచేస్తుంటాడు. ఇలా ఓ సారి పి.పి.పి.(ఆశిష్ విధ్యార్థి) ఇంటిపైన రైడ్ చేస్తాడు. కేసులోంచి తప్పించుకోవడానికి పి.పి.పి. పక్షవాతం వచ్చినట్టు నటిస్తాడు. సుబ్బలక్ష్మి(శ్రియ) పి.పి.పి. కుమార్తె. తన తండ్రి పక్షవాతం వచ్చినట్టు నటిస్తున్నాడని తెలియక, ఇందుకు కారణమైన మల్లన్న పై పగతీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా మల్లన్నని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ తన వెంట పడుతూవుంటుంది.
ఇదిలా వుంటే శ్రీ శైలంలోని మల్లన్న దేవస్థానంలోనున్న చెట్టుకు తమ సమస్యలను ఓ ఉత్తరం రాసి పెడితే ఆ మల్లన్న స్వామి తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలకు నమ్మకం కలిగేలా మల్లన్న(విక్రమ్) చేస్తాడు. మల్లన్నే ఓ విచిత్ర వేషధారణతో (కోడిని తలపించేలా) ధనవంతుల వద్ద డబ్బు దోచేసి పేదల కష్టాలు తీర్చుతుంటాడు. ఇందుకోసం తన మిత్రులతో కలిసి పదకొండుమందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుంటాడు. మల్లన్న దేవస్థానంలోని ఉత్తరాల ద్వారా ప్రజల సమస్యలు తీర్చుతున్నది ఎవరన్న దానిపై డి.ఐ.జి అధికారి ప్రభు పరిశోధన చేస్తుంటాడు. ఓ సారి పి.పి.పి. ,సుబ్బలక్ష్మి సాయంతో పథకం పన్ని మల్లన్న చేత నిజాలు చెప్పించి తను దోచేసే డబ్బులో సగం వాటా తనకి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇందులో భాగంగా మల్లన్న, సుబ్బలక్ష్మితో కలసి మెక్సికోకి వెళ్తాడు. డబ్బు తన అకౌంట్ లో చేరిందన్న విషయం తెలియగానే పి.పి.పి. మల్లన్నను చంపేయమని తన మనుషులకు చెప్తాడు. తన తండ్రి పక్షవాతం వచ్చినట్టు నటిస్తున్నాడని, డబ్బుపిచ్చి అని తెలిసిన సుబ్బలక్ష్మి నిజంగానే మల్లన్నను ప్రేమిస్తుంది.
ఇక మిగిలిన కథ ఎలా మల్లన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడన్నది. కథలో మల్లన్నను ధనికులను దోచుకోవడానికి గల కారణాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చెయ్యలేక పోయారు. డబ్బు వుండటం వల్లే ధనికులు ఇతరులని శాసిస్తున్నారన్న విషయాన్ని ఇంకా బాగా చెప్పుండే అవకాశం వుంది.