X
మనలో ఒకడు
Thriller | 04 Nov 2016 |
Telugu

మనలో ఒకడు స్టోరీ

మనలో ఒకడు సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఇది మీడియా నేపథ్యంలో సాగే కథ...ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇంకా ఇందులో నటించిన వారు అనితా హెచ్ రెడ్డి (నటషా), శ్రీ ముఖి, సాయి కుమార్ , నాజర్, తనికెళ్ళ భరణి, రఘు బాబు, దువ్వసి మోహన్, మారుతిరావు గొల్లపూడి, బెనర్జీ, ఉత్తేజ్, రాజా రవింద్ర, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించారు. నిర్మాత గురజాల జగన్ మోహన్ నిర్మించారు.

కథ

నిజాయితీయే ప్రాణంగా భావిస్తూ స్టూడెంట్స్ కు ఫిజిక్స్ భోదిస్తూ జీవిస్తున్న ఫ్రొఫెసర్ కృష్ణమూర్తి(ఆర్పీ పట్నాయిక్) . సింపుల్ గా బ్రతికే అతని భార్య శ్రావణి (అనిత) కూడా అలాంటిదే. ఆవిడ పిల్లలకి సంగీత పాఠాలు చెప్తూంటుంది. ఇల్లూ, కాలేజ్ తప్ప వేరే జీవితం ఎరగని అతని జీవితం ఓ రోజు టీవిలో వచ్చిన ఓ న్యూస్ తో తిరగబడుతుంది. కృష్ణమూర్తి పై కాలేజీలో చదువుకొనే ఓ స్టూడెంట్ తనని లైంగికంగా వేధించాడని మూడో కన్ను ఛానల్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తుంది. వెంటనే ఆ ఛానల్‌ ‘కీచకుడు' అంటూ వార్తని ప్రసారం చేస్తుంది. దాంతో కృష్ణమూర్తి రోడ్డున పడతాడు..తను నిర్దోషిని అని, తనుకు అందలో పాత్ర ఏమీ లేదని ప్రూవ్ చేసుకోవాలని కృష్ణమూర్తి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ అంతకు మించి అన్నట్లు వరస్ట్ గా అయ్యిపోతుంది సిట్యువేషన్. దాంతో కృష్ణమూర్తి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. ఇంట్లో భార్యతో విభేదాలు తలెత్తుతాయి. బయట అంతా ఓ నేరస్తుడిలా చూస్తుంటారు. నిజంగా కృష్ణమూర్తి ఆ తప్పు చేశాడా? మూడో కన్ను ఛానల్‌ ప్రసారం చేసిన ఆ వార్తలో నిజమెంత? కృష్ణమూర్తి ఉదంతంలో మూడోకన్ను ఛానల్‌ ఎండీ ప్రతాప్‌ (సాయికుమార్‌) పాత్ర ఏమిటి? ఎలా ఆ సమస్యలు నుంచి బయిటకు వచ్చాడు. తను నిర్దోషిని అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు. తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+