X
తెలుగు » సినిమాలు » మనలో ఒకడు
మనలో ఒకడు

మనలో ఒకడు

Thriller | 04 Nov 2016 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మనలో ఒకడు స్టోరీ

మనలో ఒకడు సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఇది మీడియా నేపథ్యంలో సాగే కథ... ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇంకా ఇందులో నటించిన వారు అనితా హెచ్ రెడ్డి (నటషా), శ్రీ ముఖి, సాయి కుమార్ , నాజర్, తనికెళ్ళ భరణి, రఘు బాబు, దువ్వసి మోహన్, మారుతిరావు గొల్లపూడి, బెనర్జీ, ఉత్తేజ్, రాజా రవింద్ర, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించారు. నిర్మాత గురజాల జగన్ మోహన్ నిర్మించారు. కథ నిజాయితీయే ప్రాణంగా భావిస్తూ స్టూడెంట్స్ కు ఫిజిక్స్ భోదిస్తూ జీవిస్తున్న ఫ్రొఫెసర్ కృష్ణమూర్తి(ఆర్పీ పట్నాయిక్) . సింపుల్ గా బ్రతికే అతని భార్య శ్రావణి (అనిత) కూడా అలాంటిదే. ఆవిడ పిల్లలకి సంగీత పాఠాలు చెప్తూంటుంది. ఇల్లూ, కాలేజ్ తప్ప వేరే జీవితం ఎరగని అతని జీవితం ఓ రోజు టీవిలో వచ్చిన ఓ న్యూస్ తో తిరగబడుతుంది. కృష్ణమూర్తి పై కాలేజీలో చదువుకొనే ఓ స్టూడెంట్ తనని లైంగికంగా వేధించాడని మూడో కన్ను ఛానల్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తుంది. వెంటనే ఆ ఛానల్‌ ‘కీచకుడు' అంటూ వార్తని ప్రసారం చేస్తుంది. దాంతో కృష్ణమూర్తి రోడ్డున పడతాడు..తను నిర్దోషిని అని, తనుకు అందలో పాత్ర ఏమీ లేదని ప్రూవ్ చేసుకోవాలని కృష్ణమూర్తి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ అంతకు మించి అన్నట్లు వరస్ట్ గా అయ్యిపోతుంది సిట్యువేషన్. దాంతో కృష్ణమూర్తి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. ఇంట్లో భార్యతో విభేదాలు తలెత్తుతాయి. బయట అంతా ఓ నేరస్తుడిలా చూస్తుంటారు. నిజంగా కృష్ణమూర్తి ఆ తప్పు చేశాడా? మూడో కన్ను ఛానల్‌ ప్రసారం చేసిన ఆ వార్తలో నిజమెంత? కృష్ణమూర్తి ఉదంతంలో మూడోకన్ను ఛానల్‌ ఎండీ ప్రతాప్‌ (సాయికుమార్‌) పాత్ర ఏమిటి? ఎలా ఆ సమస్యలు నుంచి బయిటకు వచ్చాడు. తను నిర్దోషిని అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు. తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
Read More

మనలో ఒకడు కాస్ట్ & క్రూ

మనలో ఒకడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆర్ పి పట్నాయక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఆర్ పి పట్నాయక్
నిర్మాత గురజాల జగన్ మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మనలో ఒకడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నిజానికి ఆర్పీ పట్నాయిక్ ఈ కథ కోసం తీసుకున్న నేపధ్యం, సంఘటనలు చాలా నాచురల్ గా ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా కథని సెటప్ చేస్తూ వెళ్లిపోయారు. ముఖ్యంగా విద్యార్థుల గౌరవాభిమానాల్ని చూరగొన్న లెక్చరర్ కృష్ణమూర్తిపై లైంగిక వేధింపుల అభియోగం రావడం ప్రేక్షకుడిని వెంటనే కథలో లీనం చేస్తుంది. అయితేనేం ఆ తర్వాత అంత పగడ్బందీగా కథని నడపలేకపోయారు. ఇలాంటి సినిమాలు పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా క్రిస్పీగా ఉంటే బాగుంటాయి. సమాజాన్ని ప్రశ్నించే విధానం నచ్చుతుంది. అంతేకానీ మెల్లిగా అదే పాయింట్ చుట్టూ అదే సీన్స్ రిపీట్ అవుతూంటే ఇబ్బందిగా ఉంటుంది. మనలో ఒకడు..అదే సమస్యను ఎదుర్కొంది. సినిమా ఫస్ట్ టర్న్ తీసుకున్న వద్దనుంచి క్లైమాక్స్ వరకూ ఒకే రకంగా ఎరౌండ్ బుష్ అన్నట్లు సాగుతుంది. ముఖ్యంగా తప్పు ఎక్కడ జరిగింది... అసలు తప్పు ఎవరు చేశారన్నది అందరికీ ముందే తెలిసినప్పటికీ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చివరిదాకా చేయకపోవడమనేది విసిగిస్తుంది. మన కథా సౌలభ్యం కోసం సీన్స్ అల్లుకుంటూ విషయం ట్రాక్ తప్పించినట్లు అనిపిస్తుంది. కథ సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రి క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాకి కీలకం. నాజర్‌, సాయికుమార్‌ల మధ్య సన్నివేశాలు సినిమాని అప్పటిదాకా ఉన్న వాటినుంచి మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఊహించని విధంగా చివర్లో .. ఆర్పీ పట్నాయక్‌ వచ్చి మీడియాకి సందేశాన్ని ఇవ్వడం మొదలుపెడతాడు. అదంతా క్లాస్‌ తీసుకొన్నట్టు అనిపిస్తాయి. మూడో కన్ను ఛానల్‌ ప్రతాప్‌ పాత్రలో సాయికుమార్‌ నటన సినిమాకి హైలెట్ గా నిలిచంది. అలాగే పబ్లిసిటీనే మెయిన్ గా .. కనీస అవగాహన లేకుండా ఛానళ్లలో కూర్చుని మాట్లాడే శతావతారం పాత్రలో జయప్రకాష్‌రెడ్డి నవ్విస్తారు.

మనలో ఒకడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • ccccccccccccccccccccccc

×
2.5 /5 Your Rating

మనలో ఒకడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+