మంగళవారం సినిమా హర్రర్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం.పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి గునుపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి స్వయంగా నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ పతాకాలపై తన మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఇంతవరకు ఓ భారతీయ సినిమాలోనూ టచ్ చేయని జోనర్‌లో ఈ చిత్రముంటుందని అజయ్ భూపతి చెప్పారు. సినిమాలో దాదాపు 30 పాత్రలు ఉంటాయని, కథనంలో అందరికీ ప్రత్యేకత ఉంటుందని స్పష్టం చేశారు.