X
మనోహరుడు
Action | Romance | 14 Jan 2015 | U/A |
Telugu

మనోహరుడు స్టోరీ

మనోహరుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇది ప్రముక దర్శకుడు శంకర్ నిర్మిస్తున్నా ఐ చిత్రం తెలుగు లో మనోహరుడు గా విడుదల అవుతోంది. ఇందులో విక్రమ్, అమ్య్ జక్షన్, సురేశ్ గొపి, సంతానం తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు.

కథ

లింగేష్(విక్రమ్) ఆర్నాల్డ్ జిమ్ లో ఔత్సాహిక బాడీ బిల్డర్. అతని జీవితాశయం మిస్టర్ ఇండియా అవ్వాలని. ఈ లోగా మిస్టర్ ఆధ్రప్రదేశ్ అవుతాడు. అయితే ఆ గెలుపు నుంచే అతనికి శతృవులు మొదలవుతారు. మరో ప్రక్క అతను ...దియా(అమీ జాక్సన్) అనే మోడల్ ని ఆరాధిస్తూంటాడు. ఆమెకు తన తోటి మోడల్ జాన్(ఉపేన్ పటేల్) నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతాయి. వాటినుంచి తప్పించుకుని తన కెరీర్ ని నిలబెట్టుకోవటం కోసం లిగేష్ ని మోడల్ గా ప్రమోట్ చేసి వాడుకోవాలనుకుంటుంది. అయితే ఆమె లింగేష్ తో ప్రేమలో పడుతుంది. అంతేకాకుండా ఆ పెయిర్ మోడలింగ్ ఫీల్డ్ లో హాట్ గా మారతారు. దాంతో ఆమె ఫ్రొఫిషనల్ వైపు నుంచి లింగేష్ కు శతృవులు ప్రారంభమవుతారు. ఈ లోగా ఊహించని విధంగా ..లింగేష్ ..ఓ అంతుపట్టని వ్యాధి వచ్చి కురూపిలా(ట్రైలర్ లో చూపినట్లు బొబ్బలతో) మారిపోవటం మొదలవుతాడు. ఇంతకీ లింగేష్ అలా మారటానికి కారణం ఏమిటి... దాని వెనక ఉన్న కుట్రను లింగేష్ ఎలా ఛేధించాడు..లింగేష్...దియా ల ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+