X
తెలుగు » సినిమాలు » మనోహరుడు
మనోహరుడు

మనోహరుడు

Action | Romance | 14 Jan 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మనోహరుడు స్టోరీ

మనోహరుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇది ప్రముక దర్శకుడు శంకర్ నిర్మిస్తున్నా ఐ చిత్రం తెలుగు లో మనోహరుడు గా విడుదల అవుతోంది. ఇందులో విక్రమ్, అమ్య్ జక్షన్ , సురేశ్ గొపి, సంతానం తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు. కథ లింగేష్(విక్రమ్) ఆర్నాల్డ్ జిమ్ లో ఔత్సాహిక బాడీ బిల్డర్. అతని జీవితాశయం మిస్టర్ ఇండియా అవ్వాలని. ఈ లోగా మిస్టర్ ఆధ్రప్రదేశ్ అవుతాడు. అయితే ఆ గెలుపు నుంచే అతనికి శతృవులు మొదలవుతారు. మరో ప్రక్క అతను ...దియా(అమీ జాక్సన్) అనే మోడల్ ని ఆరాధిస్తూంటాడు. ఆమెకు తన తోటి మోడల్ జాన్(ఉపేన్ పటేల్) నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతాయి. వాటినుంచి తప్పించుకుని తన కెరీర్ ని నిలబెట్టుకోవటం కోసం లిగేష్ ని మోడల్ గా ప్రమోట్ చేసి వాడుకోవాలనుకుంటుంది. అయితే ఆమె లింగేష్ తో ప్రేమలో పడుతుంది. అంతేకాకుండా ఆ పెయిర్ మోడలింగ్ ఫీల్డ్ లో హాట్ గా మారతారు. దాంతో ఆమె ఫ్రొఫిషనల్ వైపు నుంచి లింగేష్ కు శతృవులు ప్రారంభమవుతారు. ఈ లోగా ఊహించని విధంగా ..లింగేష్ ..ఓ అంతుపట్టని వ్యాధి వచ్చి కురూపిలా(ట్రైలర్ లో చూపినట్లు బొబ్బలతో) మారిపోవటం మొదలవుతాడు. ఇంతకీ లింగేష్ అలా మారటానికి కారణం ఏమిటి... దాని వెనక ఉన్న కుట్రను లింగేష్ ఎలా ఛేధించాడు..లింగేష్...దియా ల ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా కథ. 
Read More

మనోహరుడు కాస్ట్ & క్రూ

మనోహరుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మనోహరుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బ్యూటీ అండ్ ది బీష్ట్' ని గుర్తు చేసే ఈ చిత్రం పూర్తిగా ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో సాకే పక్కా పగ-ప్రతీకారం మార్క్ సినిమా. ప్రారంభమే కురూపిగా హీరోని ఓపెన్ చేసి..అతను ఎలా ఎందుకు అయ్యాడు అనే విషయం రివిల్ చేయటం వరకూ స్క్రీన్ ప్లే టెక్నిక్(పాతదే అయినా) బాగుంది. అయితే ఆ ప్లాష్ బ్యాక్... సినిమా మొత్తం ఆక్రమించేసింది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయితే కదా.. ప్రెజంట్ లోకి వచ్చి... ఆ ప్లాష్ బ్యాక్ తాలూకూ నీడలను, నిజాలను కనుక్కుని ప్రతీకారం తీర్చుకునేది. అలా కాకుండా ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ నే సాగతీస్తూ... చెప్తూ పోతే అసలు కథ ఎప్పుడు వింటాం...గతాన్నే పట్టుకుని ఎంత సేపు వేళ్లాడతాం... అలా అనుకుంటే ...శంకర్ గత హిట్ చిత్రాలు చక్కడా టీవీలో చూసుకోకుండా కొత్త చిత్రం చూద్దామనే థియోటర్ కి ఎందుకు వెళతాం..గతం ఎంత గొప్పదయినా...ఇప్పుడు ఏం జరుగుతుందనే దానికే కదా ప్రయారిటీ. ఎందుకనో అంత పెద్ద దర్శకుడూ ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయారు. దాంతో హీరో కి లాగానే ..కథకి జబ్బు చేసింది. హీరో కి మెయిన్ విలన్ ఎవరో తెలిసే సరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తే...ఇంక పగ ఎలా తీర్చుకుంటాడు అనేదానికు స్క్రీన్ టైమ్ ఎక్కడుంది. పోనీ ఆ మెయిన్ విలన్ ఎవరనేది తెలుసుకోవటం పెద్ద ట్విస్టా అంటే ...థియోటర్ లో కూర్చున్న చిన్న పిల్లాడు సైతం కనిపెట్టేస్తాడు. అంత వీక్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కేవలం సాంకేతికంగా, విజువల్ గా వండర్ గా తీర్చిదిద్దాలనే తపన తప్పించి మిగతా విషయాలపై ఆయన దృష్టి పెట్టలేదు.

మనోహరుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మనోహరుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+